వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఇవాళ (నవంబర్ 2) హైదరాబాద్‎లో ట్రాఫిక్ ఆంక్షలు

వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఇవాళ (నవంబర్ 2) హైదరాబాద్‎లో ట్రాఫిక్ ఆంక్షలు

మధ్యాహ్నం 1 గంట నుంచి 

  • రాత్రి 7 వరకు దారి మళ్లింపులు
  • ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జాయింట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీపీ జోయల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డేవిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

బషీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాగ్, వెలుగు : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షా హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పర్యటన నేపథ్యంలో నగరంలో సోమవారం ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆంక్షలు అమలు చేయనున్నారు. అమిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షా పాల్గొననున్న బీజేపీ పాదయాత్ర బషీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాగ్ చౌరస్తాలోని బాబు జగ్జీవన్ రాం (బీజేఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) విగ్రహం నుంచి ఎంజే మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరకు జరగనున్న నేపథ్యంలో  మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 7 గంటల వరకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆంక్షలు, వాహనాల దారి మళ్లింపులు ఉంటాయని హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జాయింట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జోయల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డేవిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తెలిపారు.

బషీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాగ్ ఏఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పంపు నుంచి బీజేఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విగ్రహం వైపు వచ్చే వాహనాలను నాంపల్లి రైల్వే స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రవీంద్రభారతి వైపు.., జాంబాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అఫ్జల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి అబిడ్స్ జీపీవో వైపు వచ్చే వాహనాలను ఎంజే మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వద్ద తాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఐలాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వైపు మళ్లించనున్నారు. పాత అంబేద్కర్​ విగ్రహం నుంచి బీజేఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విగ్రహం వైపు వచ్చే వాహనాలను లిబర్టీ వద్ద హిమాయత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వైపు.., హిమాయత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి వచ్చే వాహనాలను పాత అంబేద్కర్​ విగ్రహం, ట్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వైపు తరలించనున్నారు.

రాజారెడ్డి మార్గ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పాత ఎమ్మెల్యే క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి వచ్చే వాహనాలను బషీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జంక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వద్ద ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోలీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాంప్లెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వైపు.., కింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కోఠి నుంచి తాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మహల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హోటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వైపు వచ్చే వాహనాలను బషీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బొగ్గులకుంట వైపు పంపిస్తారు. ఎంజే మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి జీపీవో, నాంపల్లి స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోడ్డు వైపు వాహనాలకు అనుమతి ఉండదని, జీపీవో నుంచి ఎంజే మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వైపు రాకపోకలను నిలిపివేస్తామని ట్రాఫిక్ ​జాయింట్ ​సీపీ స్పష్టం చేశారు.

చాపెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సుజాత స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జంక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ రోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిసరాల్లోనూ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 7 గంటల వరకు లిబర్టీ, రవీంద్రభారతి, ఏఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పంపు, బషీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బీజేఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విగ్రహం, ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ గన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫౌండ్రీ, జీపీవో, నాంపల్లి టీ జంక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, తాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఐలాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎంజే మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అఫ్జల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జాంబాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాంతాల నుంచి వెళ్లడాన్ని నివారించాలని జాయింట్​ సీపీ సూచించారు.

పీటీఐ నుంచి రవీంద్రభారతి, కర్బలా జంక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి రవీంద్రభారతి, కట్టమైసమ్మ నుంచి చిక్కడపల్లి, నారాయణగూడ నుంచి లిబర్టీ, బషీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కోటి నుంచి అబిడ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, చాదర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఘాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి ఎంజే మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అఫ్జల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి ఎంజే మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తదితర మార్గాల్లోనూ ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రద్దీ ఎక్కువగా ఉంటుందన్నారు.

బస్సుల మళ్లింపులు ఇలా..

రవీంద్రభారతి నుంచి బీజేఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విగ్రహం వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులను ఏఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పంపు వద్ద నాంపల్లి రైల్వే స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వైపు.., ఎంజే మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి జీపీవో వైపు వెళ్లే బస్సులను తాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఐలాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వైపు..,అప్పర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి లిబర్టీ వైపు వచ్చే బస్సులను తెలంగాణ తల్లి జంక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇక్బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మినార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రవీంద్రభారతి మీదుగా మళ్లిస్తారు. అలాగే, జిల్లాల నుంచి రాణిగంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అప్పర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వైపు వచ్చే బస్సులను సీటీఓ జంక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వద్ద రసూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పురా, బేగంపేట వైపు పంపిస్తారు.

నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లు, విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులు ముందుగానే బయలుదేరాలని, స్కూల్స్​ నుంచి పిల్లలను తీసుకెళ్లే పేరెంట్స్​ కూడా ముందుగా ప్లాన్​ చేసుకోవాలని ట్రాఫిక్​ జాయింట్​ సీపీ జోయల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డేవిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సూచించారు. అత్యవసర వాహనాలకు ఇబ్బంది కలిగితే, ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సమస్యలుంటే 9010203626 నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కాల్​ చేయాలన్నారు. 

మరిన్ని వార్తలు