వల్లభాయ్ పటేల్ లేకపోతే హైదరాబాద్ కు విముక్తి జరిగేది కాదు : అమిత్ షా

 వల్లభాయ్  పటేల్ లేకపోతే హైదరాబాద్ కు విముక్తి జరిగేది కాదు : అమిత్ షా

సర్దార్ వల్లభాయ్  పటేల్ లేకపోతే హైదరాబాద్ కు విముక్తి జరిగేది కాదన్నారు కేంద్రమంత్రి అమిత్ షా..  పరేడ్ గ్రౌండ్ లో జరిగిన తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.  ఈ సందర్భంగా అమిత్ షా  మాట్లాడుతూ..  హైదరాబాద్ కు ఇవాళ విముక్తి లభించిన రోజని తెలిపారు.   విముక్తి పోరాటంలో పాల్గొన్న యోధులకు ఆయన వందనాలు తెలిపారు.  ఎంతోమంది పోరాడితే నిజాం పాలన అంతం అయిందన్నారు.  తెలంగాణ విమోచన దినోత్సవంపై దేశప్రజలందరికీ తెలియలన్నారు అమిత్ షా.

ALSO READ: జిమ్లో గుండెపోటుతో 19 ఏళ్ల యువకుడు మృతి

తెలంగాణ చరిత్రను 75 ఏళ్ల పాటు వక్రీకరించరన్నారు అమిత్ షా..  మోదీ ప్రధాని అయ్యాక ఆ పొరపాటును సరిచేశారని చెప్పారు.  చంద్రయాన్ 3 సక్సెస్ కావడంతో భారత్ అగ్రదేశంగా ఎదిగిందని తెలిపారు. 9 ఏళ్ల మోదీ పాలనలో దేశం ఎంతో ప్రగతి సాధించిందని వెల్లడించారు.  మోదీ కృషి వల్లే ఇదంతా సాధ్యమైందని చెప్పుకొచ్చారు.  తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కొందరు రాజకీయం చేస్తున్నారన్న అమిత్ షా.. వారికి ప్రజలే బుద్ది చెప్తారని అన్నారు.  స్వాతంత్య్ర పోరాటాన్ని కూడా కాంగ్రెస్ వక్రీకరించదని ఆరోపించారు.