స్టూడెంట్లలో పెరుగుతున్న సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ నేచర్

స్టూడెంట్లలో పెరుగుతున్న సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ నేచర్
  • స్టూడెంట్లలో పెరుగుతోన్న సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ నేచర్  
  • ట్యూషన్లు చెప్తూ,  క్యాబ్ డ్రైవర్లు, డెలివరీ బాయ్స్​గా పనిచేస్తున్న యూత్  
  • పేరెంట్స్​కు ఖర్చుల భారం తగ్గించేందుకు సొంతంగా సంపాదన

నేను, చెల్లి కేరళ నుంచి ఇక్కడికి వచ్చి అపోలో ఇనిస్టిట్యూషన్ లో ఫిజియోథెరపీ కోర్సు చేస్తున్నాం.  కాలేజీ ఫీజు లక్షల్లో ఉంటుంది. ఇక్కడ ఉండటానికి రూమ్​రెంట్, ఫుడ్, ఇతర ఖర్చులు కలిసి నెలకు రూ.18 వేల పైనే అవుతోంది. మా పేరెంట్స్ కి ఈ భారాన్ని తగ్గించాలని  ఆరో తరగతి లోపు పిల్లలకు ట్యూషన్ చెప్తున్నా.  కాలేజ్ అయ్యాక సాయంత్రం ట్యూషన్ తీసుకుంటా. ప్రతి నెల రూ.6 వేల దాకా వస్తున్నాయి.  వాటిని సొంత ఖర్చులకు వాడుతున్నా’ అని ఫిజియోథెరపీ స్టూడెంట్ రిన్సీ చెప్తోంది.

ఖైరతాబాద్​లోని గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో బీకామ్ కంప్యూటర్స్ సెకండ్ ఇయర్ చదువుతున్నా. అమ్మా, నాన్నకు ఇబ్బంది కావొద్దని రెండేళ్లుగా ఓ కంపెనీలో  ఆఫీస్ బాయ్ గా పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్న. క్లాసులను, వర్క్ ను మేనేజ్ చేసుకుంటున్న.  బయట ఫంక్షన్లకు, మ్యారేజ్ లకు ఫొటోగ్రాఫర్ కు అసిస్టెంట్ గా కూడా వెళ్తున్నా. ఇలా వచ్చిన డబ్బులను ఇంట్లో వాళ్లకి ఇవ్వడంతో పాటు నా ఖర్చుల కోసం వాడుకుంటున్నా’  అని స్టూడెంట్ నాగ సురేష్ చెప్పాడు.

హైదరాబాద్, వెలుగు:  బాగా చదువుకోవాలన్న ఆశ, తల్లింద్రడులకు ఇబ్బంది కలిగించొద్దన్న ఆలోచన.. నేటి యువతలో  బాగా నాటుకుపోతోంది.  నచ్చిన కోర్సులు చేసేందుకు స్టూడెంట్లు సొంత సంపాదన మీద దృష్టి పెడుతున్నారు.  చదువుకుంటూనే పార్ట్​ టైం జాబ్ చేస్తూ  తల్లిదండ్రులకు ఖర్చుల భారం తగ్గిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్​ వచ్చిన స్టూడెంట్లు తెలిసిన పనుల్లో చేరుతూ డబ్బులు సంపాదిస్తున్నారు. వాటిని ఫీజులకు, సొంత ఖర్చులకు వాడుతున్నారు.  ఒకవైపు చదువు, మరోవైపు పార్ట్​ టైం జాబ్​ చేస్తూ మల్టీ టాస్కింగ్​ కెరీర్​ను హ్యాండిల్​ చేస్తున్నారు. దీంతో చిన్న వయసులోనే జాబ్ ​ఎక్స్​పీరియన్స్​పొందుతూ.. డబ్బు విలువ తెలుసుకుంటున్నారు.  చదువు, ఉద్యోగం కోసం సిటీకి వచ్చి కొందరు జల్సాలకు బానిసవుతుండగా..   డ్రీమ్స్ ను నిజం చేసుకునేందుకు మంచి లైఫ్ కోసం కష్టపడుతున్న యువత కూడా ఇక్కడ కనిపిస్తున్నారు.  ఇతర ప్రాంతాల నుంచి వచ్చి సిటీలోని కాలేజీల్లో చదవాలంటే  అకడమిక్ ఫీజులు, హాస్టల్ ఫీజు, పాకెట్ మనీ ఇలా బొలెడంత ఖర్చు ఉంటుంది. ఇంటి నుంచి డబ్బులు తీసుకుంటూ పేరెంట్స్ కి భారంగా మారకుండా చాలామంది పార్ట్ టైమ్ జాబ్ ల్లో చేరుతూ సొంతంగా సంపాదించుకుంటున్నారు. పిల్లలకు ట్యూషన్​ చెప్పడం దగ్గర నుంచి  డెలివరీ బాయ్స్ గా,  క్యాబ్ డ్రైవర్లు, బైక్ రైడర్లు, ఆఫీస్ బాయ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హెల్పర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సేల్స్ బాయ్స్ గా  ఇలాంటి జాబ్ లు చేస్తూ  ప్రతి నెల సంపాదిస్తున్నారు. ఇలా మల్టీ కెరీర్​ ఆప్షన్స్​పై, సెకండ్ ఇన్​కం సోర్స్​పై  ఫోకస్ పెడుతున్నారు. పెయింగ్ గెస్ట్ , హాస్టల్స్, రూమ్ ల్లో ఉంటూ కాలేజీలు, ఇనిస్టిట్యూషన్లకు వెళ్తూ టైమ్ దొరికినప్పుడల్లా పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ నెలకు రూ.10 వేల నుంచి 15 వేల వరకు సంపాదిస్తున్నారు.  

ఫీజుల కోసం..

చాలా మంది స్టూడెంట్లు రాష్ట్రంలోని జిల్లాల నుంచి ఉన్నత చదువుల కోసం సిటీకి వస్తున్నారు. నచ్చిన కోర్సులు చేసేందుకు ఫీజులు కట్టలేని పరిస్థితి ఉండటంతో కేవలం  దాని కోసమే పార్ట్ టైమ్ జాబ్ లు చేసేవారు చాలా మంది ఉన్నారు. రూ,వేలు, లక్షల్లో ఉన్న ఫీజులను కట్టడానికి నైట్ డ్యూటీలు, పార్ట్​ టైం జాబ్స్ వెతుక్కుంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి సిటీలోని కాలేజీల్లో, ఇనిస్టిట్యూట్లలో చేరుతున్న వారు సైతం సొంత ఖర్చుల కోసం పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నారు.  జాబ్ చేస్తూనే పోటీ పరీక్షలకు సైతం ప్రిపేర్ అయ్యే వారు సిటీలో ఎక్కువగానే ఉన్నారు.

సైబర్ సెక్యూరిటీ కోర్సు కోసం..

సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్​లో సైబర్ సెక్యూరిటీ కోర్సులో జాయిన్ అవ్వాలని అనుకుంటున్నా. కోర్సు టైమ్ పీరియడ్ ప్రకారం ఫీజు రూ. 30 వేల నుంచి రూ.60 వేల వరకు ఉంటుంది. ప్లేస్ మెంట్, హాస్టల్ ఫీజు, ఇతర ఖర్చులన్నీ కలిపి రూ. లక్షకు పైగానే అవుతాయి. ఇంట్లో వాళ్లకు భారం కావొద్దని కోర్సు ఫీజు కట్టేందుకు ఉబర్ బైక్​లో రైడ్స్ కొడుతున్నా. వచ్చే నెలలో కోర్సులో జాయిన్ అయితా.

- ప్రదీప్ , స్టూడెంట్, కూకట్​పల్లి