జూ. డేవిస్ కప్ టీమ్‌‌‌‌‌‌‌‌లో హైదరాబాదీ హృతిక్

జూ. డేవిస్ కప్ టీమ్‌‌‌‌‌‌‌‌లో హైదరాబాదీ హృతిక్

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ యంగ్ టెన్నిస్ ప్లేయర్ కటకం హృతిక్ ప్రతిష్టాత్మక జూనియర్ డేవిస్ కప్ ఆసియా/ఓషియానియా ఫైనల్ క్వాలిఫయింగ్ ఈవెంట్‌‌‌‌‌‌‌‌లో పాల్గొనే ఇండియా జట్టుకు ఎంపికయ్యాడు. ఈ టీమ్‌‌‌‌‌‌‌‌లో నంబర్ వన్ ప్లేయర్‌‌‌‌‌‌‌‌గా హృతిక్ చోటు దక్కించుకున్నాడు. హైదరాబాద్ చెంగిచర్లకు చెందిన ఈ కుర్రాడు ఇటీవల జరిగిన సెలెక్షన్ ట్రయల్స్‌‌‌‌‌‌‌‌లో ఆడిన ఐదు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లోనూ విజయం సాధించి టాప్ ప్లేస్ సాధించాడు. 

హృతిక్‌‌‌‌‌‌‌‌తో పాటు రిభవ్ సరోహా, తవిష్ పహ్వా ఇతర  ప్లేయర్లుగా ఉన్న జట్టుకు రాణా బెనర్జీ కోచ్‌‌‌‌‌‌‌‌గా వ్యవహరించనున్నాడు.  మే 18 నుంచి 23 వరకు కజకిస్తాన్‌‌‌‌‌‌‌‌లోని షిమ్​కెంట్​లో ఈ టోర్నీ జరగనుంది. హృతిక్‌‌‌‌కు  డేవిస్ కప్  మాజీ ప్లేయర్ విష్ణువర్ధన్  మెంటార్‌‌‌‌‌‌‌‌గా వ్యవహరిస్తున్నాడు.