మన దగ్గరే గోల్డ్​ ఐస్​ క్రీం

మన దగ్గరే గోల్డ్​ ఐస్​ క్రీం

ఐస్​ క్రీమ్స్​ అంటే ఇష్టమా? అయితే కచ్చితంగా ఈ గోల్డ్​ ఐస్​క్రీం ట్రై చేయాల్సిందే. దీన్ని తినాలంటే పక్క రాష్ట్రాలకో లేదా మరేదైనా దేశానికో వెళ్లాలేమో అనుకుంటే పొరపాటే. మన హైదరాబాద్​లోని బంజారాహిల్స్​లో ఉన్న హ్యుబర్​ అండ్​ హోలి కేఫ్​కి వెళ్తే సరిపోతుంది.  ఇప్పుడు గోల్డ్​ ఐస్​క్రీమ్స్​ మన దగ్గరా ఉన్నాయి. హైదరాబాద్​లోని కేబీఆర్​ పార్క్​ ఎదురుగా ఉన్న హ్యుబర్​ అండ్​ హోలి కేఫ్​లో గోల్డ్​ ​ఐస్​క్రీం దొరుకుతోంది. దీని గురించి ఫేమస్​ ఫుడ్​ బ్లాగర్​ అభినవ్​ జస్వాని సోషల్​మీడియాలో పోస్ట్ చేయడంతో ఎక్కువమందికి తెలిసింది. 

ది బెస్ట్​ ఐస్​క్రీం
అభినవ్​ జస్వావి నాగాలాండ్​కి చెందిన ట్రావెలర్, ఫుడ్​ బ్లాగర్​. ‘జస్ట్​ నాగపూర్​ థింగ్స్’ ​ అనే ఇన్​స్టాగ్రామ్​, ఫేస్​బుక్​ పేజీల్లో దేశంలోని పాపులర్​ ఫుడ్​ని ఎక్స్​ప్లోర్​ చేస్తుంటాడు. యూట్యూబ్​లోనూ తను టేస్ట్​ చేసి బెస్ట్​ వంటకాల్ని పరిచయం చేస్తుంటాడు. రీసెంట్​గా అలా హైదరాబాద్​లోని  24 గోల్డ్​ ఐస్​క్రీం టేస్ట్​ చేశాడు అభినవ్​. ‘మైటీ మిదాస్’​ పేరుతో పిలిచే ఆ ఐస్​క్రీంకి ఇప్పటివరకు తను టేస్ట్​ చేసిన ఐస్​క్రీంలలో ది బెస్ట్​ అంటూ కాంప్లిమెంట్ ఇచ్చాడు ఈ ఫుడ్​ బ్లాగర్​. తన ఫాలోవర్స్​ని​ కచ్చితంగా టేస్ట్​ చేయమని రిక్వెస్ట్​ చేశాడు కూడా. దాంతో ఇప్పుడు అందరి చూపు ఈ హైదరాబాదీ ఐస్​క్రీంపై పడింది. 

500 రూపాయలకి దొరికే ఈ ఐస్​క్రీం తయారీ చాలా స్పెషల్​. దానికి సంబంధించిన ఐదున్నర నిమిషాల వీడియోని సోషల్​ మీడియాలో పోస్ట్​ చేశాడు అభినవ్​. అందులో చాక్లెట్​ కోన్​లో బ్రౌనీ, డబుల్​ చీజ్​, మిక్స్​డ్​ డ్రై ఫ్రూట్స్​ ఒకదాని తర్వాత ఒకటి వేస్తారు. ఆ తర్వాత డబుల్​ సాస్​ , బెల్జియం చాక్లెట్  ఐస్​క్రీం వేసి మళ్లీ పైనుంచి డబుల్​ సాస్​ , గోల్డెన్ చాక్లెట్​ ఐస్​క్రీం​ వేస్తారు. 24 గోల్డ్​ ఈటబుల్​ గోల్డ్ ఫాయిల్​ ఆ ఐస్​ క్రీం చుట్టూ చుట్టి, ఈటబుల్​ స్పూన్​,  మినీ మాక్రూన్, గోజి బాల్స్,  హాజెల్ నట్ బాల్స్​తో కలర్​ఫుల్​గా డెకరేట్​ చేస్తారు. చివరిగా నైట్రోజన్​ స్మోక్​ ఇచ్చి ఈ ఐస్​క్రీంని సర్వ్​ చేస్తున్నారు.