ఇండియా నుంచి అమెరికా చేరిన హైడ్రాక్సీక్లోరోక్విన్

ఇండియా నుంచి అమెరికా చేరిన హైడ్రాక్సీక్లోరోక్విన్

వాషింగ్టన్: కరోనా ట్రీట్ మెంట్ కోసం ఇండియా పంపిన హైడ్రాక్సీక్లోరోక్విన్ మందులు అమెరికాకు చేరుకున్నాయి. ఇండియా నుంచి హైడ్రాక్సీక్లోరోక్విన్ కన్సైన్ మెంట్ న్యూయార్క్ ఎయిర్ పోర్టుకు చేరుకుందని అమెరికాలోని ఇండియన్ అంబాసిడర్ తరణ్ జిత్ సింగ్ సంధూ ట్వీట్ చేశారు. గతవారం ప్రధాని మోడీకి ఫోన్ చేసిన అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్.. హైడ్రాక్సీ క్లోరో క్విన్ పంపాలని కోరారు. అమెరికాతోపాటు ఇతర దేశాలకు మానవతా దృక్పథంతో సాయం చేసేందుకు ఈ డ్రగ్ ఎగుమతిపై ఉన్న బ్యాన్ ను ఇండియా ఎత్తివేసింది. ఈ నిర్ణయం తీసుకున్న ప్రధాని మోడీకి ట్రంప్ థ్యాంక్స్ కూడా చెప్పారు. ట్రంప్ విజ్ఞప్తి మేరకు 35.82 లక్షల హైడ్రాక్సీ క్లోరో క్విన్ ట్యాబ్లెట్లు, 9 మెట్రిక్ టన్నుల ఫార్మాస్యూటికల్ ఇన్ గ్రెడియెంట్స్ (క్లోరోక్విన్ తయారీలో వాడేవి) ను ఇండియా పంపింది.