హైజీన్ ప్రొడక్ట్సే కొంటున్నరు

హైజీన్ ప్రొడక్ట్సే కొంటున్నరు

శానిటైజర్లకు ఫుల్ గిరాకీ
ఇమ్యూనిటీ బూస్టర్లకూ డిమాండ్

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌రాకతో దేశంలోని ప్రజల షాపింగ్‌ అలవాట్లు బాగా మారాయి. జనం ఎప్పుడూ లేనంతగా పరిశుభ్రతకు పెద్ద పీట వేస్తున్నారు. గతంలో సబ్బులు, షాంపూలు ఎక్కువగా కొనేవారందరూ ఇప్పుడు శానిటైజర్లు, హ్యాండ్ ‌గ్లోవ్స్‌ను తమ షాపింగ్‌ లిస్టుల్లో భాగంగా చేసుకుంటున్నారు. పరిశుభ్రంగా ఉండటం ఇప్పుడు ఇంపార్టెంట్‌గా మారడం వల్లే కొనుగోలు అలవాట్లూ మారుతున్నాయని ఎక్స్‌పర్టులు చె
బుతున్నారు. ఉదాహరణకు ఢిల్లీ యువతి కృతిక క్రియాను తీసుకుంటే, తన షాపింగ్ అలవాట్లు చాలా మారాయని ఆమె చెబుతున్నారు. తాజాగా తన అమెజాన్ షాపింగ్ కార్నుట్ చూసి ఒకింత ఆశ్చర్యం కలిగిందని ఆమె పేర్కొంటున్నారు. ఎందుకంటే షాంపూలు, క్రీమ్ల కంటే శానిటైజర్లు, హ్యాండ్‌ గ్లోవ్స్‌, ఫ్లోర్ క్నలీర్లు, హ్యాండ్ వాష్ లే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కిరాణా సామాన్లలో హైజెనిక్ ప్రొడక్టుల వాటా పెరిగిపోయింది. సబ్బులు, వాషింగ్ పౌడర్ల ఖర్చు మాత్రం తగ్గింది.

‘‘కరోనా వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కదా!’’ అంటూ చమత్కరించారు కృతి. ఇలా చాలా మందే ఇప్పుడు హైజెనిక్ ప్రొడక్టుల కోసం ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. కిరాణా, సూపర్ మార్కెట్ల వాళ్లు కూడా ఇలాంటి వస్తువులకు గిరాకీ పెరిగిందని చెబుతున్నారు. గతంలో డిష్ వాషర్ల అమ్మకాలు పెద్దగా ఉండేవి కావని, ఇప్పుడు సేల్స్ బాగా పెరిగాయని ఎలక్ట్రానిక్స్ టైలర్ విజయ్ సేల్స్ఎండీ నీలేశ్ గుప్తా అన్నారు. ఈ సెగ్మెంట్ గత ఏడాదితో పోలిస్తే ఈసారి 200 శాతం పెరిగిందని వోల్టాస్ సీఈఓ ప్రదీప్ బక్షి అన్నారు. అందుకే తమ కంపెనీ డిష్ వాషర్ల‌పై ప్రచారాన్ని పెంచిందని వివరించారు. కరోనాకు ముందు ఇలాంటి ప్రొడక్టులను ఎవరూ పట్టించుకోలేదని మార్కెట్ స‌ర్వేలు కూడా చెబుతున్నాయి. దాదాపు 90 శాతం మంది షాపింగ్ అలవాట్లు మారినట్టు తమ సర్వేలో తేలిందని మార్కెట్ రీసెర్చ సంస్థ మెకెన్సీ వెల్లడించింది. హైజెనిక్ ప్రొడక్టులకు ఎప్పుడూ లేనంత గిరాకీ పెరిగిందని పేర్కొంది. కంపెనీలు కూడా తమ ప్రొడక్టులు రోగనిరోధక శక్తిని పెంచుతాయనే  ప్రచారాన్ని ఎక్కువ చేశాయని వివరించింది.

కొత్త కొత్త ప్రొడక్టులు వస్తున్నయ్..

కేవలం ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగానూ జనం షాపింగ్ అలవాట్లు మారాయన్నది ఎక్స్ ప‌ర్టులు చెబుతున్న మాట. ఇండియాలో కరోనాకు ముందు శానిటైజర్ వాడే వారి సంఖ్య రెండు శాతం కూడా ఉండేది కాదు. ఇప్పుడు ప్రతి ఇంట్లో ఇది తప్పనిసరి అయింది. శుభ్రత కు ఎక్కువ ఇంపార్టెన్ర్టెస్ ఇవ్వడం అనివార్యంగా మారింది. ఈ విషయాన్ని గమనించిన కంపెనీలు కొత్త కొత్త ప్రొడక్టులను తీసుకొస్తున్నాయి. కొన్ని కంపెనీలైతే యాంటీ వైరస్దుస్తులను అమ్ముతున్నాయి. మరికొన్ని యూవీ శానిటైజర్ బాక్సులను లాంచ్ చేశాయి. వీటిలో కూరగాయలు, మాంసం, ఐస్క్రీములను ఉంచితే క్రిములు మరణిస్తాయని ప్రచారం చేస్తున్నాయి. తాము ప్రతి 15 రోజులకు ఒకసారి కొత్త హైజీన్ ప్రొడక్టును తీసుకొస్తున్నామని ఐటీసీ సీఈఓ సమీర్ సత్పతి వెల్లడించారు.

కరోనా కారణంగా కంపెనీలకు కొత్త కొత్త అవకాశాలు వస్తున్నాయని అన్నారు. కొన్ని కంపెనీలు ఆటోమాటిక్ శానిటైజర్ డిస్పెన్సర్ల‌ను అమ్ముతున్నాయి. కెంట్ కంపెనీ ఇది వరకు నెలకు దాదాపు 5 00 వెజిటబుల్ శానిటైజర్లు మాత్రమే అమ్మేది. ఇప్పుడు వాటి సంఖ్య ఐదు వేలకు చేరిందంటే పరిస్థితి ఎంతమారిందో సులువుగా అర్థంచేసుకోవచ్చు. డాబర్ కూడా బ్యాటరీతో నడిచే దోమల రాకెట్ ను తయారు చేసింది. శానిటైజర్ల‌ను, మెడికేటెడ్సోపులను, ఎయిర్శాని టైజర్ల‌నూ అమ్ముతున్నది. అంతేకాదు కంపెనీలు తమ హైజినెక్ ప్రొడక్టుల కెపాసిటీని పెంచుతున్నాయి. ఇంట్లో ఉండే సమయం పెరుగుతోంది. కాబట్టి కరెంటును ఆదా చేసే వస్తువుల కోసమూ జనం వెతుకుతున్నారు.

వాషింగ్ మెషీన్లు తక్కువే..

మనదే శంలో ఇప్పటికీ 14.3 శాతం ఇండ్లలో మాత్రమే వాషింగ్మెషీన్లు ఉన్నాయి. ఫ్రిజ్లు ఉన్న ఇండ్ల సంఖ్య 34 శాతం మించదు. చాలా మందికి నౌకర్లు ఉంటారు కాబట్టే ఇలాంటివి కొనడం లేదని, ఇలాంటి వారికి డబ్బు సమస్య కాకపోవచ్చని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు ఎండీ నిమిషా జైన్ అన్నారు. అయితే, హైజెనిక్ ప్రొడక్టులపై అంతటా అవగాహన పెరిగిందని, సగటున వారానికి రెండు లక్షల కొత్త కుటుంబాలు హ్యాండ్ వాష్ లను, శానిటైజర్ల‌ను కొంటున్నాయని కంపెనీలు అంటున్నాయి. ఇవన్నీ బహుశా అలవాటుగా మారుతాయని, ఇక రోజూ వాడతారని చెబుతున్నాయి. మనం మరింత పరిశుభ్రంగా ఉండాలన్న విషయం కరోనా వల్ల జనానికి అర్ద‌మైందని కెవిన్కేర్ కంపెనీ సీఈఓ విజయరాఘవన్ అన్నారు.