పవన్ ను తిట్టే శాఖను పెట్టుకొండి:హైపర్ ఆది

పవన్  ను తిట్టే శాఖను పెట్టుకొండి:హైపర్ ఆది

ఏపీ మంత్రులపై హైపర్‌ ఆది సెటైర్లు వేశారు. శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలంలో నిర్వహించిన జనసేన యువశక్తి సభలో మాట్లాడిన ఆది... మంత్రులకు శాఖలు ఎందుకని.. పవన్‌ని తిట్టే శాఖ ఒకటి పెట్టుకోండంటూ ఎద్దేవా చేశారు. పవన్  కళ్యాణ్ ప్రేమకు లొంగుతాడు తప్ప.. ప్యాకేజ్‌కు కాదన్నాడు. తాను సినిమా వాడిగా ఇక్కడికి రాలేదని, జనసేన సిద్ధాంతాలు నచ్చి వచ్చినట్టుగా ఆది చెప్పారు. రెండు చోట్ల ఓడిపోతానే పవన్ ప్రజలకు ఇంతా చేశాడని, గెలిస్తే వారి కష్టం కాంపౌండ్ వాల్ కూడా దాటదన్నారు.  కౌలు రైతుల కష్టాలు తీర్చడానికే పవన్  సినిమా చేశాడని పేర్కొన్నారు.

అలాంటి పవన్ ను తిట్టేందుకు మంత్రలు ప్రెస్ మీట్ పెట్టి బూతులు తీడుతున్నారని,  అలాంటివారికి శాఖలు ఎందుకు.. ? పవన్ కళ్యాణ్  ను తిట్టే శాఖను ఒకటి పెట్టుకొండంటూ ఆది విమర్శించారు. ఏ నోటితే అయితే మీరు పవన్ ను  దత్తపుత్రుడని అంటున్నారో అదే నోటితో అంజనీపుత్రుడని అనిపించుకుంటారని ఆది తెలిపారు. ప్రతీ ఒక్కడు పవన్  కళ్యాణ్ గురించి మాట్లాడి పాపులర్ అవుదామని చూస్తున్నారని.. ఈ సారి  జనసేన కొట్టే దెబ్బకు మీ అబ్బ గుర్తుకొస్తారంటూ ఆది వ్యాఖ్యానించారు. పవన్‌ది నిలకడ లేని రాజకీయం కాదని.. నిఖార్సైన రాజకీయమని తెలిపారు. ప్రస్తుతం హైపర్ ఆది చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.