14న ఏఐపై హైసియా నేషనల్ సమ్మిట్‌‌

14న ఏఐపై  హైసియా నేషనల్ సమ్మిట్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు : హైదరాబాద్‌‌ సాఫ్ట్‌‌వేర్ ఎంటర్‌‌‌‌ప్రైజ్‌‌ అసోసియేషన్ (హైసియా)  ఈ నెల 14న  నేషనల్ సమ్మిట్ అండ్ అవార్డ్స్ 31 వ  ఎడిషన్‌‌ను హెచ్‌‌ఐసీసీలో  నిర్వహించనుంది. ఈవెంట్‌‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) గురించి చర్చించనున్నారు. దేశంలోని టాప్ కంపెనీలకు చెందిన 35 కి పైగా  ఐటీ ఎక్స్‌‌పర్ట్‌‌లు, సీఈఓలు, చీఫ్‌‌ టెక్నాలజీ ఆఫీసర్లు (సీటీఓ) పాల్గొననున్నారు. ఏఐపై మాట్లాడనున్నారు. వివిధ సెక్టార్లలో ఏఐ  వాడకం ఎలా ఉంటుంది? 

టాప్ కంపెనీల మేనేజ్‌‌మెంట్స్‌‌ ఏఐని ఎలా చూస్తున్నాయి? ఈ టెక్నాలజీ అందించే  జాబ్స్, స్కిల్స్‌‌ వంటి అంశాలపై చర్చలు జరపనున్నారు. మొత్తం 500 మందికి పైగా విజిటర్లు పాల్గొంటారని హైసియా అంచనా వేస్తోంది. అంతేకాకుండా 130 కి పైగా కంపెనీలు తమ ఏఐ ప్రొడక్ట్‌‌లను ఈ ఈవెంట్‌‌లో ప్రదర్శించనున్నాయని, సాయంత్రం సెషన్‌‌లో అవార్డ్‌‌ల ప్రధానం కూడా ఉంటుందని వివరించింది.

 హైసియా ఈవెంట్‌‌లో  రాష్ట్ర ఐటీ మినిస్టర్‌‌‌‌ డీ శ్రీధర్ బాబు చీఫ్‌‌ గెస్ట్‌‌గా పాల్గొననున్నారు. ఎస్‌‌టీపీఐ డైరెక్టర్‌‌‌‌  జనరల్ అర్వింద్ కుమార్‌‌‌‌, టెక్ మహీంద్రా మాజీ సీఈఓ సీపీ గుర్నాని, టీసీఎస్‌‌ ప్రెసిడెంట్ వీ రాజన్న తదితరులు పాల్గొననున్నారు.