వచ్చి మార్చుకోండి : 34 లక్షల హుందాయ్, కియా కార్లలో ప్రాబ్లమ్

వచ్చి మార్చుకోండి : 34 లక్షల హుందాయ్, కియా కార్లలో ప్రాబ్లమ్

యూఎస్ లో    దాదాపు 34 లక్షల   వాహనాలను  హ్యుందాయ్, కియా  రీకాల్ చేస్తున్నాయి.  ఇంజిన్ కంపార్ట్‌మెంట్ లో  మంటలు వచ్చే ప్రమాదం ఉన్నందున వాటిని తిరిగి వెనక్కి తీసుకుంటుంది. ఈ క్రమంలో  బయట పార్క్ చేయాలని కార్ల యజమానులను ఆదేశించాయి.  

కార్లలో యాంటీ-లాక్ బ్రేక్ కంట్రోల్ మాడ్యూల్ ఫ్లూయిడ్‌ను లీక్ చేసి ఎలక్ట్రికల్ షార్ట్‌కు కారణమవుతోంది.  వాహనాలు పార్క్ చేస్తున్నప్పుడు లేదా నడుపుతున్నప్పుడు మంటలు చెలరేగవచ్చని యుఎస్ సేఫ్టీ రెగ్యులేటర్లు  తెలిపారు. రిపేర్  చేసే వరకు బయట పార్కింగ్ చేయాలని..  నిర్మాణాలకు దూరంగా ఉంచాలని వాహనదారులు యజమానులకు సూచిస్తున్నారు.  డీలర్లు యజమానులకు ఎటువంటి ఖర్చు లేకుండా యాంటీ-లాక్ బ్రేక్ ఫ్యూజ్‌ని భర్తీ చేయనున్నారని తెలిపారు. నవంబర్ 14 నుండి ఓనర్‌లకు నోటిఫికేషన్ లెటర్‌లను పంపుతామని  వెల్లడించింది. తమ కస్టమర్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ రీకాల్ చేస్తున్నట్లు వాహన హ్యుందాయ్ తెలిపింది.

హ్యుందాయ్ రీకాల్ చేయనున్న కార్లలో  2011 - 2015 మోడల్ Elantra, జెనెసిస్ కూపే ,సొనాటా హైబ్రిడ్, 2012 - 2015 మోడల్ యాక్సెంట్, Azera ,Veloster, 2013 - 2015  మోడల్  Elantra Coupe , Santa Fe,  2012 మోడల్ వెరాక్రూజ్, 2010 - 2013 మోడల్ టక్సన్, 2015 టక్సన్ ఫ్యూయల్ సెల్ , 2013 శాంటా ఫే స్పోర్ట్ మోడల్ కార్లు ఉన్నాయి.