
న్యూఢిల్లీ: జీఎస్‌టీ రేట్లు తగ్గిన నేపథ్యంలో హ్యుందాయ్ మోటార్ ఇండియా తన అన్ని మోడళ్ల ధరలను రూ.60,640 నుంచి రూ.2.4 లక్షల వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ తగ్గింపు సెప్టెంబర్ 22 నుంచి వర్తించనుంది. వెర్నాపై రూ.60,640 తగ్గింపు ఉండగా, ప్రీమియం ఎస్‌యూవీ టక్సన్‌పై రూ.2.4 లక్షల తగ్గింపు ఉంటుంది. తాజా సంస్కరణలు ఆటోమొబైల్ సెక్టార్‌కు ఊపునిస్తాయని కంపెనీ ఎండీ ఉన్సో కిమ్ అన్నారు. ప్యాసింజర్ బండ్ల ధరలు తగ్గిస్తామని ఇప్పటికే ప్రకటించిన టాటా మోటార్స్, తన కమర్షియల్ వెహికల్స్ రేట్లను రూ.30 వేల నుంచి రూ.4.65 లక్షల వరకు తగ్గిస్తామని పేర్కొంది.