పెద్దగా కుంకుమ బొట్టు పెట్టుకునేవాళ్లంటే భయం : సిద్ధరామయ్య

పెద్దగా కుంకుమ బొట్టు పెట్టుకునేవాళ్లంటే భయం : సిద్ధరామయ్య

బదామి : కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య మరోసారి తన కామెంట్స్ తో కాంట్రవర్సీ క్రియేట్ చేశారు. మంగళవారం బదామీలో చెరువు ఆధునీకరణ ప్రాజెక్టు ప్రారంభించిన సందర్భంగా ఓ కాంట్రాక్టర్ ను ఉద్దేశించి ఈ కామెంట్స్ చేశారు సిద్ధరామయ్య. “నాకు నుదుటిపై పెద్దపెద్దగా, పొడవైన బొట్టు పెట్టుకునేవాళ్లంటే భయం. అలా పెట్టుకునే వాళ్లు పద్ధతిగా… నిజాయితీగా ఉండాలి. నీకు అప్పగించిన పనిని గడువులోగా పూర్తిచేయాలి. అంత పెద్ద పెద్ద బొట్టు ఎవరు పెట్టుకుంటారో తెలుసా నీకు? ఎందుకో నాకే తెలియదు గానీ… నుదుటన పెద్దసైజులో ఎర్రబొట్టు పెట్టుకునేవాళ్లంటే నాకు చాలా భయం” అని సిద్ధరామయ్య అన్నారు.

సిద్ధరామయ్య కామెంట్స్ ఇపుడు కర్ణాటకలో డిస్కషన్ టాపిక్ అయ్యాయి. సిద్ధరామయ్య పలు వ్యాఖ్యలు, చేష్టలతో చాలాసార్లు విమర్శలు ఎదుర్కొన్నారు. మొన్నామధ్య ఓ సమావేశంలో ప్రశ్నిస్తున్న మహిళ చేతిలోనుంచి మైక్ తీసుకునేందుకు సిద్ధరామయ్య ప్రయత్నించడంతో… ఆమె పైట ఊడిరావడం పెద్ద వివాదానికి కారణమైంది. ఆ తర్వాత సిద్ధరామయ్య సారీ చెప్పాల్సి వచ్చింది.