అవును.. ఆ హీరోతో రిలేషన్ లో ఉన్నా: రకుల్ ప్రీత్ సింగ్

అవును.. ఆ హీరోతో రిలేషన్ లో ఉన్నా: రకుల్ ప్రీత్ సింగ్

టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.. తన ప్రేమ వ్యవహారాన్ని వెల్లడించింది. బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నాని తో రిలేషన్ లో ఉన్నట్టు సోషల్ మీడియాలో ప్రకటించింది రకుల్ ప్రీత్ సింగ్. తన ప్రియుడితో సరదాగా విహరిస్తున్న ఫోటోను అభిమానులకు షేర్ చేసింది రకుల్ ప్రీత్ సింగ్. తన ప్రియుడు జాకీ భగ్నానీని ఉద్దేశించి ఇలా రాసింది..  ‘‘థ్యాంక్యూ మై లవ్.. ఈ ఏడాది అందుకున్న అతి పెద్ద బహుమతి నువ్వే.. నా జీవితంలో రంగులు నింపి.. నన్ను నిరంతరం సంతోష పెడుతున్నందుకు ధన్యవాదాలు..’’ అంటూ ఇన్ స్టా ఖాతాలో షేర్ చేసింది. 
జాకీ భగ్నానీ హిస్టరీ ఏమిటంటే..
టాలీవుడ్ లో ప్రముఖ హీరోయిన్ గా వెలుగొందుతున్న రకుల్ ప్రీత్ సింగ్ తన ప్రేమ వ్యవహారాన్ని బట్టబయలు చేస్తూ.. అభిమానులతో పంచుకోవడంతో.. ఆమె ప్రేమనందుకున్న బాలీవుడ్ హీరో ఎవరబ్బా అంటూ అభిమానులు సహా అనేకులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. బాలీవుడ్ లో యువ హీరోగా.. నిర్మాతగానూ వ్యవహరిస్తున్న జాకీ భగ్నానీ జీవిత చరిత్ర సినీ నేపథ్యంతోనే ముడిపడి ఉంది. హిందీ చిత్ర పరిశ్రమలో ప్రముఖ నిర్మాత వశు భగ్నానీ కుమారుడే జాకీ భగ్నానీ. కోల్ కతాకు చెందిన జాకీ  భగ్నానీ ఉన్నత విద్యను అభ్యసించినా.. సినిమాలపై మోజుతో అమెరికాలో యాక్టింగ్ కోర్సు కంప్లీట్ చేసి బాలీవుడ్ రంగ ప్రవేశం చేశారు. న్యూయార్క్ లోని లీ స్ట్రాస్ బర్గ్ థియేటర్ అండ్ ది ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ లో యాక్టింగ్ కోర్సు పూర్తి చేసిన జాకీ భగ్నానీ ‘కల్ కిస్నే దేఖా’ సినిమాతో హిందీ హీరోగా తెరంగేట్రం చేశారు. 
మొదటి సినిమా ఇచ్చిన ఉత్సాహంతో ‘ఫాల్తు, అజబ్ గజబ్ లవ్, యంగిస్థాన్, వెల్కమ్ టు కరాచీ’ తదితర సినిమాల్లో నటించి మెప్పించాడు. అంతే కాదు పాన్ ఇండియా నటుడిగా మెప్పించేందుకు ‘మోహిని’ అనే సినిమాతో కోలీవుడ్ లో సైతం ఎంట్రీ ఇచ్చారు. తండ్రి నిర్మాతగా వ్యవహరిస్తున్న బ్యాక్ గ్రౌండ్ కుటుంబ నేపథ్యంలో.. మంచి కథలు దొరకడంతో నిర్మాతగా కూడా అవతారమెత్తారు జాకీ భగ్నానీ. కూలీ నెంబర్ -1, బెల్ బాటమ్, సర్బీత్, దిల్ జంగ్లీ, వెల్కమ్ టు న్యూయార్క్‘ తదితర సినిమాలు నిర్మించి సత్తా చాటే ప్రయత్నం చేశాడు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rakul Singh (@rakulpreet)