మోహన్ బాబు-మంచు లక్ష్మీ సినిమాకు అగ్ని నక్షత్రం టైటిల్

మోహన్ బాబు-మంచు లక్ష్మీ సినిమాకు అగ్ని నక్షత్రం టైటిల్

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, మంచు లక్ష్మి కాంబినేషన్‌లో వస్తున్న ఫస్ట్ మూవీ "అగ్ని నక్షత్రం". విలక్షణ నటుడు సముద్రఖని, మలయాళీ నటుడు సిద్ధిక్,  విశ్వంత్ , జబర్దస్త్ మహేష్ లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమాను డైరెక్టర్ ప్రతీక్ ప్రజోష్  తెరకెక్కిస్తున్నాడు. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్- మంచు ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై మోహన్ బాబు,లక్ష్మీ ప్రసన్నలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ లాంచ్ కార్యక్రమం శుక్రవారం ఉదయం 9:29 గంటలకు ఘనంగా జరిగింది. తండ్రీ కూతుళ్ళైన మోహన్ బాబు, మంచు లక్ష్మి ఫస్ట్ టైం కలిసి నటించడం విశేషం. మంచి ముహూర్తాన "అగ్ని నక్షత్రం" అనే టైటిల్ రివీల్ చేయడం జరిగిందని టీమ్ తెలిపింది. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. లుక్స్ చూస్తుంటే ఇదొక పోలీస్ స్టోరీ అని అర్థం అవుతుంది. భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి  డైమండ్ రత్నబాబు కథ అందించారు. మధురెడ్డి ఎడిటర్ గా లిజో కె జోస్ సంగీతం, గోకుల్ భారతి కెమెరామెన్ గా వ్యవహరిస్తున్నారు. శర వేగంగా షూటింగ్ జరుపు కుంటున్న ఈ మూవీ కంప్లీట్ కావడానికి చివరి దశలో ఉందని టీమ్ చెప్పింది. ట్రైలర్, సాంగ్స్, సినిమా రిలీజ్ కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే అఫీషియల్ గా అనౌన్స్ చేస్తామన్నారు.