తెలంగాణ ఎన్నికల్లో నేను పోటీ చేయడం లేదు : ప్రొఫెసర్ కోదండరామ్

తెలంగాణ ఎన్నికల్లో నేను పోటీ చేయడం లేదు  :  ప్రొఫెసర్ కోదండరామ్

తెలంగాణలో మరికొన్ని రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని తెలంగాణ జన సమితి చీఫ్ ప్రొఫెసర్ కోదండరామ్ చెప్పారు.  కేసీఆర్ ప్రభుత్వాన్ని , కుటుంబాన్ని  తరిమి కొట్టడమే తన లక్ష్యమని చెప్పారు.  అధికారాన్ని అడ్డం పెట్టుకుని సీఎం కేసీఆర్ లక్షల కోట్లు అప్పు చేశాడని ఆరోపించారు.  రాష్ట్రం అప్పుల పాలైయిందని,  బీఆర్ఎస్  అనేది ప్రజలకు భారమైందని తెలిపారు.  

ALSO READ: వంద సీట్లు గ్యారెంటీ.. బీఆర్ఎస్ హ్యాట్రిక్‌ ఖాయం : కేసీఆర్

తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని కోదండరామ్ చెప్పుకొచ్చారు.   కేసీఆర్ మాయమాటలకు, పథకాలకు మోసపోవద్దని, బీఆర్ఎస్ మేనిఫేస్టో లో ఏమి లేదన్నారు. ఉద్యోగాలు రావడం లేదని ఎవరూ ఆత్మహత్య చేసుకోద్దని చెప్పిన ఆయన..  ప్రవాళిక ఆత్మహత్యపై ప్రభుత్వం దిగజారుడు,  తప్పుడు ప్రచారం మానుకోవాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి ఖాయమని తెలిపారు.