కోహ్లీ కల చెదిరె.. బెంగళూరు ఖేల్ ఖతం

కోహ్లీ కల చెదిరె.. బెంగళూరు ఖేల్ ఖతం

షార్జా: ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  విరాట్‌‌‌‌‌‌‌‌ కోహ్లీ కల చెదిరింది. కెప్టెన్‌‌‌‌‌‌‌‌గా రాయల్‌‌‌‌‌‌‌‌ చాలెంజర్స్‌‌‌‌‌‌‌‌ బెంగళూరుకు తొలి టైటిల్‌‌‌‌‌‌‌‌ అందించాలన్న అతని లక్ష్యం నెరవేరలేదు. ఈ సీజన్‌‌‌‌‌‌‌‌ తర్వాత కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని ప్రకటించిన విరాట్‌‌‌‌‌‌‌‌ తన టీమ్‌‌‌‌‌‌‌‌ను ట్రోఫీ దగ్గరికి తీసుకెళ్లలేకపోయాడు. బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌, బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో ఫెయిలైన ఆర్​సీబీ టోర్నీ నుంచి ఎలిమినేట్‌‌‌‌‌‌‌‌ అయింది. మరోవైపు చివర్లో ప్లే ఆఫ్స్‌‌‌‌‌‌‌‌ బెర్తు దక్కించుకున్న కోల్‌‌‌‌‌‌‌‌కతా నైట్‌‌‌‌‌‌‌‌ రైడర్స్‌‌‌‌‌‌‌‌ క్వాలిఫయర్‌‌‌‌‌‌‌‌2కు దూసుకెళ్లింది. విండీస్‌‌‌‌‌‌‌‌ మిస్టరీ స్పిన్నర్‌‌‌‌‌‌‌‌  సునీల్‌‌‌‌‌‌‌‌ నరైన్‌‌‌‌‌‌‌‌ (4/21, 15 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 3 సిక్సర్లతో 26) ఆల్‌‌‌‌‌‌‌‌రౌండ్‌‌‌‌‌‌‌‌ పెర్ఫామెన్స్‌‌‌‌‌‌‌‌తో చెలరేగిన వేళ సోమవారం జరిగిన ఎలిమినేటర్‌‌‌‌‌‌‌‌ పోరులో కేకేఆర్‌‌‌‌‌‌‌‌ 4 వికెట్ల తేడాతో ఆర్‌‌‌‌‌‌‌‌సీబీని ఓడించి టైటిల్‌‌‌‌‌‌‌‌ రేసులో నిలిచింది. ఫస్ట్‌‌‌‌‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ చేసిన ఆర్‌‌‌‌‌‌‌‌సీబీ 20 ఓవర్లలో 138/7 స్కోరు చేసింది. విరాట్‌‌‌‌‌‌‌‌ కోహ్లీ (33 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 5 ఫోర్లతో 39), దేవదత్‌‌‌‌‌‌‌‌ పడిక్కల్‌‌‌‌‌‌‌‌ (18 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 2 ఫోర్లతో 21) మాత్రమే రాణించారు. కేకేఆర్‌‌‌‌‌‌‌‌ బౌలర్లలో నరైన్‌‌‌‌‌‌‌‌తో పాటు లోకి ఫెర్గూసన్‌‌‌‌‌‌‌‌ (2/30) రెండు వికెట్లు తీశాడు. అనంతరం కోల్‌‌‌‌‌‌‌‌కతా 19.4 ఓవర్లలో 139/6 స్కోరు చేసి గెలిచింది. నరైన్‌‌‌‌‌‌‌‌తో పాటు శుభ్‌‌‌‌‌‌‌‌మన్‌‌‌‌‌‌‌‌ గిల్‌‌‌‌‌‌‌‌ (18 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 4 ఫోర్లతో 29), వెంకటేశ్‌‌‌‌‌‌‌‌ అయ్యర్‌‌‌‌‌‌‌‌ (26), నితీశ్‌‌‌‌‌‌‌‌ రాణా (23) ఆకట్టుకున్నారు. నరైన్‌‌‌‌‌‌‌‌కే  ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌ అవార్డు దక్కింది. బుధవారం జరిగే క్వాలిఫయర్‌‌‌‌‌‌‌‌2లో ఢిల్లీతో కేకేఆర్‌‌‌‌‌‌‌‌ పోటీ పడనుంది. ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో నెగ్గిన టీమ్‌‌‌‌‌‌‌‌.. 15న సీఎస్‌‌‌‌‌‌‌‌కేతోఫైనల్​ ఆడుతుంది. 

కేకేఆర్‌‌‌‌‌‌‌‌ కష్టంగానే..

చిన్న టార్గెట్‌‌‌‌‌‌‌‌ను కాపాడుకునేందుకు ఆర్‌‌‌‌‌‌‌‌సీబీ బౌలర్లు ఆఖరిదాకా పోరాడటంతో గెలుపు కోసం కోల్‌‌‌‌‌‌‌‌కతా కష్టపడాల్సి వచ్చింది. ఫామ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న  గిల్‌‌‌‌‌‌‌‌, వెంకటేశ్‌‌‌‌‌‌‌‌ అయ్యర్‌‌‌‌‌‌‌‌ ఫస్ట్‌‌‌‌‌‌‌‌ వికెట్‌‌‌‌‌‌‌‌కు 41 రన్స్‌‌‌‌‌‌‌‌ జోడించి  పునాది వేశారు. ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ మూడో బాల్‌‌‌‌‌‌‌‌కే ఫోర్‌‌‌‌‌‌‌‌ కొట్టిన గిల్​.. గార్టన్‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో గిల్‌‌‌‌‌‌‌‌ 4,4,4తో రెచ్చిపోయాడు. అయితే,  పవర్‌‌‌‌‌‌‌‌ప్లే ఫైనల్‌‌‌‌‌‌‌‌ ఓవర్లో బౌలింగ్‌‌‌‌‌‌‌‌కు వచ్చిన హర్షల్‌‌‌‌‌‌‌‌ పటేల్‌‌‌‌‌‌‌‌.. తన సెకండ్ బాల్‌‌‌‌‌‌‌‌కే గిల్‌‌‌‌‌‌‌‌ను ఔట్‌‌‌‌‌‌‌‌ చేసి ఈ జోడీని విడదీశాడు. తర్వాతి ఓవర్లోనే ఓ గూగ్లీతో త్రిపాఠి (6)ని ఎల్బీ చేసిన చహల్‌‌‌‌‌‌‌‌ కేకేఆర్‌‌‌‌‌‌‌‌కు షాకిచ్చాడు. కానీ, మ్యాక్స్‌‌‌‌‌‌‌‌వెల్‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో రివర్స్‌‌‌‌‌‌‌‌ స్వీప్‌‌‌‌‌‌‌‌ షాట్‌‌‌‌‌‌‌‌తో సిక్స్‌‌‌‌‌‌‌‌, మరో ఫోర్‌‌‌‌‌‌‌‌ కొట్టిన నితీశ్‌‌‌‌‌‌‌‌ రాణా  టీమ్​పై ప్రెజర్‌‌‌‌‌‌‌‌ తగ్గించగా.. సగం ఓవర్లకు కేకేఆర్‌‌‌‌‌‌‌‌ 74/2తో నిలిచింది. హర్షల్‌‌‌‌‌‌‌‌ వేసిన తర్వాతి ఓవర్లో వెంకటేశ్‌‌‌‌‌‌‌‌ ఔటైనా.. ఐదో నంబర్‌‌‌‌‌‌‌‌లో వచ్చిన సునీల్‌‌‌‌‌‌‌‌ నరైన్‌‌‌‌‌‌‌‌ చెలరేగాడు.  డాన్‌‌‌‌‌‌‌‌ క్రిస్టియన్‌‌‌‌‌‌‌‌ వేసిన 12వ ఓవర్లో వరుసగా మూడు సిక్సర్లు కొట్టి 22 రన్స్‌‌‌‌‌‌‌‌ రాబట్టడంతో మ్యాచ్‌‌‌‌‌‌‌‌ కేకేఆర్‌‌‌‌‌‌‌‌ వైపు మొగ్గింది. అయినా ఆశలు కోల్పోని ఆర్సీబీ  బౌలర్లు తర్వాతి మూడు ఓవర్లలో 11 రన్స్‌‌‌‌‌‌‌‌ మాత్రమే ఇచ్చారు. ఈ క్రమంలో రాణా వికెట్‌‌‌‌‌‌‌‌ తీసిన చహల్‌‌‌‌‌‌‌‌ ఆర్‌‌‌‌‌‌‌‌సీబీని రేసులోకి తెచ్చాడు. దాంతో,  నరైన్‌‌‌‌‌‌‌‌, దినేశ్‌‌‌‌‌‌‌‌ కార్తీక్‌‌‌‌‌‌‌‌ (10) జాగ్రత్త పడ్డారు. చివరి 18 బాల్స్‌‌‌‌‌‌‌‌లో ఆ టీమ్‌‌‌‌‌‌‌‌కు 15 రన్స్‌‌‌‌‌‌‌‌ అవసరమైన దశలో 17ఓవర్లో నరైన్‌‌‌‌‌‌‌‌తో పాటు కార్తీక్‌‌‌‌‌‌‌‌ను ఔట్‌‌‌‌‌‌‌‌ చేసి 3 రన్సే ఇచ్చిన సిరాజ్‌‌‌‌‌‌‌‌మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో టెన్షన్‌‌‌‌‌‌‌‌ రేపాడు. 19వ ఓవర్లో గార్టన్‌‌‌‌‌‌‌‌ ఐదు రన్సే ఇవ్వడంతో.. లాస్ట్‌‌‌‌‌‌‌‌ ఓవర్లో కేకేఆర్‌‌‌‌‌‌‌‌కు 7 రన్స్‌‌‌‌‌‌‌‌ అవసరం అయ్యాయి. క్రిస్టియన్‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో ఫస్ట్‌‌‌‌‌‌‌‌ బాల్‌‌‌‌‌‌‌‌కే  స్కూప్‌‌‌‌‌‌‌‌ షాట్‌‌‌‌‌‌‌‌తో బౌండ్రీ కొట్టిన  షకీబ్‌‌‌‌‌‌‌‌ (9 నాటౌట్‌‌‌‌‌‌‌‌).. కెప్టెన్‌‌‌‌‌‌‌‌ మోర్గాన్‌‌‌‌‌‌‌‌ (5 నాటౌట్‌‌‌‌‌‌‌‌)తో కలిసి జట్టును ఒడ్డుకు చేర్చాడు.

నరైన్‌‌‌‌ మ్యాజిక్​

టాస్‌‌ నెగ్గి ఫస్ట్‌‌ బ్యాటింగ్‌‌కు దిగిన ఆర్‌‌సీబీకి ఓపెనర్లు కోహ్లీ, పడిక్కల్‌‌ మంచి ఆరంభమే ఇచ్చినా.. విండీస్‌‌ వెటరన్‌‌ స్పిన్నర్‌‌ సునీల్‌‌ నరైన్‌‌ దెబ్బకు తల్లడిల్లింది. నాలుగు కీలక వికెట్లు తీసిన నరైన్ బెంగళూరును కట్టడి చేశాడు. స్టార్టింగ్‌‌లో మాత్రం  కోహ్లీ, పడిక్కల్‌‌ అదరగొట్టారు. ఐదు ఓవర్లలోనే 49 రన్స్‌‌ జోడించారు.  ఇన్నింగ్స్‌‌ ఆరో బాల్‌‌కే బౌండ్రీకి చేర్చిన విరాట్.. మావి వేసిన రెండో ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టాడు. ఫెర్గూసన్‌‌ బౌలింగ్‌‌లో పడిక్కల్‌‌ కూడా రెండు ఫోర్లు బాది స్పీడు పెంచాడు. కానీ, ఫెర్గూసన్‌‌ తర్వాతి ఓవర్లోపడిక్కల్‌‌ బౌల్డ్‌‌ అవడంతో కోల్‌‌కతాకు ఫస్ట్ బ్రేక్‌‌ లభించింది. ఇక, పవర్‌‌ ప్లే తర్వాత కేకేఆర్‌‌ కెప్టెన్‌‌ మోర్గాన్‌‌.. వరుసగా స్పిన్నర్లతో బౌలింగ్‌‌ చేయించి ఫలితం రాబట్టాడు. షకీబ్‌‌ (0/24),  చక్రవర్తి (0/20)  పొదుపుగా బౌలింగ్‌‌ చేసి రన్స్‌‌ నియంత్రించారు. ఈ క్రమంలో పదో ఓవర్లో బౌలింగ్‌‌కు వచ్చిన నరైన్‌‌.. ఓవర్‌‌కో వికెట్‌‌ చొప్పున తన స్పెల్‌‌లో నాలుగు వికెట్లు తీసి ఆర్‌‌సీబీని చావు దెబ్బకొట్టాడు. అతని బౌలింగ్‌‌లో భారీ షాట్‌‌ ఆడిన భరత్‌‌ (9) లాంగాఫ్‌‌లో  వెంకటేశ్‌‌కు చిక్కాడు. ఆపై, నరైన్‌‌ తక్కువ ఎత్తులో వేసిన స్లో బాల్స్‌‌కు కోహ్లీ, డివిలియర్స్‌‌ (11) క్లీన్‌‌ బౌల్డ్‌‌ అయ్యారు. వరుసగా వికెట్లు పడడంతో మ్యాక్స్‌‌వెల్‌‌ (15), షాబాజ్‌‌ అహ్మద్‌‌ (13) ఒక్కో రన్‌‌ జోడిస్తూ  జాగ్రత్త పడ్డారు. చివర్లో  జోరు పెంచే ప్రయత్నంలో సునీల్‌‌ వేసిన 17వ ఓవర్లో భారీ షాట్‌‌కు ట్రై చేసిన మ్యాక్సీ  థర్డ్‌‌మ్యాన్‌‌లో ఫెర్గూసన్‌‌కు క్యాచ్‌‌ ఇచ్చాడు.  షాబాజ్‌‌, డాన్‌‌ క్రిస్టియన్‌‌ (9), హర్షల్‌‌ పటేల్‌‌ (8 నాటౌట్) చివరి మూడు ఓవర్లలో 25 రన్స్‌‌ రాబట్టడంతో ఆర్‌‌సీబీ స్కోరు చాలా కష్టంగా 130 మార్కు దాటింది. 

నా బెస్ట్‌ ఇచ్చా

ఆర్‌సీబీ కెప్టెన్‌గా నా బెస్ట్‌ ఇచ్చా. నా కెప్టెన్సీ పట్ల ఎలాంటి రెస్పాన్స్‌ ఉందో తెలియదు గానీ.. నా వరకైతే ఈ ఫ్రాంచైజీకి 120 శాతం ఇచ్చా. ఇకపై దీన్ని ఓ ప్లేయర్‌గా కొనసాగిస్తా. అలాగే,  టీమ్‌లో యంగ్‌స్టర్స్‌కు అవకాశాలు ఇచ్చా.  వాళ్లు టీమ్‌లోకి వచ్చి స్వేచ్ఛగా ఆడే కల్చర్‌ క్రియేట్‌ చేసేందుకు ప్రయత్నించా.  వచ్చే మూడేళ్లలో టీమ్‌ను పునర్మించే ప్రయత్నంలో భాగం అవుతా. 

‑ విరాట్ కోహ్లీ
 

మరిన్ని వార్తలు