సిగరెట్లు తాగుతూ నాకూతురికి అడ్డంగా దొరికి పోయా..అందుకే సిగరెట్లే మానేశా

సిగరెట్లు తాగుతూ నాకూతురికి అడ్డంగా దొరికి పోయా..అందుకే సిగరెట్లే మానేశా

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో తాను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, ఫన్నీ ఇన్సిడెంట్స్ తో పాటు తన రాజకీయానికి సంబంధించిన ఆసక్తికర విషయాల్ని వెలుగులోకి తెచ్చారు. ఏ ప్రామిస్డ్ ల్యాండ్ పేరుతో ఒబామా బుక్ రాశారు. నవంబర్ 17న రిలీజ్ కానున్న ఆ బుక్ లో తాను అమెరికా అధ్యక్షుడిగా వైట్ హౌజ్ లో పనిచేసే సమయంలో ఒత్తిడి తట్టుకోలేక రోజుకు 8నుంచి 10సిగరెట్లు ఎలా తాగింది. తాను సిగరెట్లు తాగే సమయంలో తన పెద్ద కూతురు మాలియా చూడడంతో సిగరెట్లు మానేసిన విషయాల్ని ప్రస్తావించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందు తాను సిగరెట్లు తాగినట్లు పుస్తకంలో ప్రస్తావించిన ఒబామా..అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత మానేసినట్లు చెప్పారు. అయితే ఒకానొక సమయంలో అధ్యక్షునిగా ఉన్నప్పుడు పని ఒత్తిడి ఎక్కువై తట్టుకోలేక సిగరెట్లు తాగినట్లు తన మధుర స్మృతుల్ని గుర్తు చేసుకున్న బరాక్ ఒబామా.