తెలుగులో ఎంట్రీకి ఇదే బెస్ట్ స్క్రిప్ట్ అనిపించింది : డినో మోరియా

తెలుగులో ఎంట్రీకి ఇదే బెస్ట్ స్క్రిప్ట్ అనిపించింది :  డినో మోరియా

అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ‘ఏజెంట్‌‌’ చిత్రంలో బాలీవుడ్ నటుడు డినో మోరియా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈనెల 28న సినిమా విడుదలవుతున్న సందర్భంగా డినో మోరియా మాట్లాడుతూ ‘స్టోరీ వినగానే తెలుగులో ఎంట్రీకి ఇదే బెస్ట్ స్క్రిప్ట్ అనిపించింది. ముగ్గురు ఏజెంట్స్ మధ్య క్యాట్ అండ్ మౌస్ చేజ్ ఇది. నేను  ‘గాడ్‌‌’ అనే  ఏజెంట్‌‌గా నటించా. తనకు జరిగిన ద్రోహం కారణంగా వ్యవస్థపై పగ తీర్చుకునే నెగెటివ్ రోల్. ఎమోషన్, డ్రామా, మ్యాడ్‌‌నెస్‌‌ ఉన్న పాత్ర. 

ముగ్గురు ఏజెంట్స్ మినహా ‘పఠాన్’ కథతో పోలిక లేదు. ‘ప్రియురాలు పిలిచింది’ తర్వాత మళ్లీ మమ్ముట్టి గారితో కలిసి నటించడం గొప్ప అనుభూతి. ఇందులో ఆయనికి ఎదురుతిరిగే పాత్రలో నా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించా. షూటింగ్ చాలా ఫన్ అండ్ అడ్వెంచరస్‌‌గా సాగింది. నాలుగు లేయర్ల కాస్ట్యూమ్స్‌‌తో బుడాపెస్ట్ చలిలో పని చేయడం సౌకర్యంగా ఉన్నా, 40 డిగ్రీల వేడిలో మస్కట్  ఎడారిలో షూట్ చేయడం హారిబుల్ ఫీలింగ్. ఆ కష్టానికి తగిన ఫలితం దొరుకుతుందని, తెలుగులో అవకాశాలు వస్తాయని నమ్ముతున్నా. త్వరలో మలయాళంలో డెబ్యు చేస్తున్నా. నేను అన్నిటికి ఓపెన్ గా ఉన్నాను’ అన్నాడు.