ఢిల్లీకి ఆహ్వానిస్తారని భావిస్తున్నా

ఢిల్లీకి ఆహ్వానిస్తారని భావిస్తున్నా

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీకి పాకిస్తాన్​ సిస్టర్​ ఖమర్​ మొహసిన్​ షేక్​రాఖీ పంపారు. రేష్మీ రిబ్బన్​పై ఎంబ్రాయిడరీ వర్క్ చేసిన రాఖీతో పాటు ఖమర్ ఓ లేఖను పంపారు. ‘‘నన్ను ఈసారి ఢిల్లీకి మోడీ ఆహ్వానిస్తారని అనుకుంటున్నాను. అందుకు ఏర్పాట్లు చేసుకున్నాను. 2024 ఎన్నికల్లోనూ మోడీ గెలుస్తారు” అని ఖమర్ లేఖలో పేర్కొన్నారు. మోడీ ఆయురారోగ్యాలతో ఉండాలని దేవున్ని ప్రార్థిస్తున్నట్టు వివరించారు.

ప్రధానిగా మోడీ దేశానికి మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు. 20 ఏండ్లుగా మోడీకి ఖమర్​ రాఖీ పంపిస్తున్నారు. పాక్​ సిటిజన్​ అయిన ఆమె.. పెండ్లయ్యాక గుజరాత్​ లోని అహ్మదాబాద్​లో ఉంటున్నారు. ఆమె మోడీని తన సోదరుడిగా భావిస్తారు.