టెక్నిక్‌‌‌‌‌‌‌‌.. సూపర్బ్‌‌‌‌‌‌‌‌

టెక్నిక్‌‌‌‌‌‌‌‌.. సూపర్బ్‌‌‌‌‌‌‌‌

వెలుగు స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెస్క్‌‌‌‌‌‌‌‌: నేను విరాట్​ కోహ్లీలా గొప్ప క్రికెటర్‌‌‌‌‌‌‌‌ను కావాలి’ చిన్నప్పుడు స్కూల్‌‌‌‌‌‌‌‌ టోర్నీల సందర్భంగా తన కోచ్‌‌‌‌‌‌‌‌ రాజేశ్‌‌‌‌‌‌‌‌ నాగర్‌‌‌‌‌‌‌‌తో.. యశ్‌‌‌‌‌‌‌‌ ధూల్‌‌‌‌‌‌‌‌ అన్న మాటలివి. అప్పుడు ఏదో సరదాగా అనుంటాడులే అనుకుంటే.. ఇప్పుడు ట్రోఫీతో విరాట్‌‌‌‌‌‌‌‌ సరసన నిలిచే వాడు కాదు. ఆనాడు అన్న ఆ మాటలను, ఆ కలను నెరవేర్చుకునే క్రమంలో ఈ ఢిల్లీ కుర్రాడు ‘విరాట్‌‌‌‌‌‌‌‌–మహి’లా మారిపోయాడు. ఈ రెండు స్పెషల్‌‌‌‌‌‌‌‌ క్యారెక్టర్స్‌‌‌‌‌‌‌‌ అతన్ని గొప్ప క్రికెటర్‌‌‌‌‌‌‌‌గా మార్చడంతో పాటు అండర్‌‌‌‌‌‌‌‌–19 కెప్టెన్సీ తెచ్చిపెట్టింది. 

10 ఏళ్ల ఏజ్‌‌‌‌‌‌‌‌లో ద్వారకలోని బాల్‌‌‌‌‌‌‌‌ భవన్‌‌‌‌‌‌‌‌ స్కూల్‌‌‌‌‌‌‌‌ అకాడమీలో క్రికెట్‌‌‌‌‌‌‌‌ ఓనమాలు దిద్దిన ధూల్‌‌‌‌‌‌‌‌.. మూడేళ్లలో స్ట్రాంగ్‌‌‌‌‌‌‌‌ బ్యాటర్‌‌‌‌‌‌‌‌గా ఎదిగాడు. అలా ఎదగడానికి ఏకైక కారణం ‘చాలా త్వరగా నేర్చుకునే లక్షణమే’ అని నాగర్‌‌‌‌‌‌‌‌ వెల్లడించాడు. ‘అకాడమీలో చేరడానికి వచ్చినప్పుడు కొత్త స్టూడెంట్లకు చెప్పినట్లుగానే ప్యాడ్స్‌‌‌‌‌‌‌‌ కట్టుకుని నెట్స్‌‌‌‌‌‌‌‌లో బాల్‌‌‌‌‌‌‌‌ హిట్‌‌‌‌‌‌‌‌ చేయమని యశ్‌‌‌‌‌‌‌‌కు చెప్పా. సైడ్‌‌‌‌‌‌‌‌ ఆర్మ్‌‌‌‌‌‌‌‌తో నేను కొన్ని బాల్స్‌‌‌‌‌‌‌‌ త్రో చేశా. అయితే ఆ బాల్స్‌‌‌‌‌‌‌‌ ఎదుర్కొనే టెక్నిక్‌‌‌‌‌‌‌‌ నన్ను ఆకట్టుకుంది. ఎక్స్‌‌‌‌‌‌‌‌పీరియెన్స్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్ల మాదిరిగా చాలా ఈజీగా ఆడేశాడు. నెక్స్ట్‌‌‌‌‌‌‌‌ డే జరిగే ఓ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో బాగా రన్స్‌‌‌‌‌‌‌‌ చేస్తే అడ్మిషన్‌‌‌‌‌‌‌‌ ఇస్తా అని మరో కండీషన్‌‌‌‌‌‌‌‌ పెట్టా. దానికి రెడీ అయిన యశ్‌‌‌‌‌‌‌‌.. ఆ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో సెంచరీ చేశాడు. ఇక అడ్మిషన్‌‌‌‌‌‌‌‌ ఇవ్వక తప్పలేదు. ఓ బ్యాటర్‌‌‌‌‌‌‌‌గా అతని ప్రస్తానం అక్కడి నుంచి మొదలైంది’ అని నాగర్‌‌‌‌‌‌‌‌ పేర్కొన్నాడు.  బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌లో విరాట్‌‌‌‌‌‌‌‌ను విపరీతంగా అభిమానించే యశ్‌‌‌‌‌‌‌‌.. అతనిలా షాట్స్‌‌‌‌‌‌‌‌ కొట్టేందుకు ఎక్కువగా ట్రై చేస్తాడు. ‘యశ్‌‌‌‌‌‌‌‌ 360 డిగ్రీల్లో షాట్స్‌‌‌‌‌‌‌‌ ఆడతాడు. బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌, ఫీల్డింగ్‌‌‌‌‌‌‌‌లో చాలా అగ్రెసివ్‌‌‌‌‌‌‌‌గా ఉంటాడు. ఫీల్డింగ్‌‌‌‌‌‌‌‌లో ఏ చాన్స్‌‌‌‌‌‌‌‌ వచ్చినా వదులుకోడు. ప్రతి షాట్‌‌‌‌‌‌‌‌, స్టైల్‌‌‌‌‌‌‌‌ విరాట్‌‌‌‌‌‌‌‌లా ఉండేలా ట్రై చేస్తాడు. యశ్‌‌‌‌‌‌‌‌ రిస్ట్‌‌‌‌‌‌‌‌ చాలా స్ట్రాంగ్‌‌‌‌‌‌‌‌. ప్రెజర్‌‌‌‌‌‌‌‌ సిచ్యువేషన్‌‌‌‌‌‌‌‌లోనూ స్ట్రయిక్‌‌‌‌‌‌‌‌ బాగా రొటేట్‌‌‌‌‌‌‌‌ చేస్తాడు. అయితే విరాట్‌‌‌‌‌‌‌‌లా స్వీప్‌‌‌‌‌‌‌‌ షాట్స్‌‌‌‌‌‌‌‌ పెద్దగా ఆడలేడు. మిగతా విషయాల్లో కోహ్లీని తలపిస్తాడు’ అని నాగర్‌‌‌‌‌‌‌‌ గుర్తు చేశాడు. 

కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌ కూల్‌‌‌‌‌‌‌‌..

ఓ బ్యాటర్‌‌‌‌‌‌‌‌గా దూకుడును చూపే యశ్‌‌‌‌‌‌‌‌.. కెప్టెన్‌‌‌‌‌‌‌‌గా మాత్రం చాలా కూల్‌‌‌‌‌‌‌‌గా ఉంటాడని నాగర్‌‌‌‌‌‌‌‌ వెల్లడించాడు. ఈ విషయంలో మహీని ఆదర్శంగా తీసుకుంటాడని చెప్పాడు. ‘అప్పుడు మేం డెహ్రడూన్‌‌‌‌‌‌‌‌లో ఇంటర్‌‌‌‌‌‌‌‌ స్కూల్‌‌‌‌‌‌‌‌ టోర్నీ ఆడుతున్నాం. ఇంజ్యూరీతో టీమ్‌‌‌‌‌‌‌‌ కెప్టెన్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌కు దూరమయ్యాడు. జట్టులో సీనియర్లు ఉన్నా నేను యశ్‌‌‌‌‌‌‌‌పై నమ్మకం పెట్టా. కెప్టెన్సీ చాలెంజ్‌‌‌‌‌‌‌‌ను నేను అతని ముందు ఉంచా. ప్రభ్​సిమ్రాన్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌లాంటి సీనియర్లు ఉన్న పటియాలతో మ్యాచ్‌‌‌‌‌‌‌‌. యశ్‌‌‌‌‌‌‌‌.. స్టార్టింగ్‌‌‌‌‌‌‌‌లోనే ఆఫ్‌‌‌‌‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌‌‌‌‌ను బౌలింగ్‌‌‌‌‌‌‌‌కు దించాడు. మంచి ఏరియాస్‌‌‌‌‌‌‌‌లో బాల్స్‌‌‌‌‌‌‌‌ ఏ విధంగా వేయాలో చెప్పి అతన్ని బౌలింగ్‌‌‌‌‌‌‌‌కు దించాడు.  ఆ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో స్పిన్నర్‌‌‌‌‌‌‌‌ ఏడు వికెట్లు తీశాడు. యశ్‌‌‌‌‌‌‌‌ డెసిషన్‌‌‌‌‌‌‌‌కు మేం సర్‌‌‌‌‌‌‌‌ప్రైజ్‌‌‌‌‌‌‌‌ అయ్యాం. ఎందుకంటే లాస్ట్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో స్పిన్నర్‌‌‌‌‌‌‌‌ పెర్ఫామెన్స్‌‌‌‌‌‌‌‌ బాగాలేదు. నేను కూడా అతనికి బౌలింగ్‌‌‌‌‌‌‌‌ వద్దనే కోరుకున్నా. కానీ అతని టాలెంట్‌‌‌‌‌‌‌‌ను నమ్మి బౌలింగ్‌‌‌‌‌‌‌‌ ఇవ్వడంతో స్పిన్నర్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌ను గెలిపించాడు. దీంతో అతని కెప్టెన్సీపై మాకు నమ్మకం కుదిరింది. కొంత మంది ప్లేయర్ల కోసం యశ్‌‌‌‌‌‌‌‌ చాలాసార్లు కోచ్‌‌‌‌‌‌‌‌లతో గొడవపడిన సందర్భాలూ ఉన్నాయి. అతనికి రిజల్ట్‌‌‌‌‌‌‌‌ తప్పితే మరొకటి అవసరం లేదు’ అని నాగర్‌‌‌‌‌‌‌‌ చెప్పుకొచ్చాడు.