కథ చెప్పినప్పుడు థ్రిల్ అయ్యాను : రోషన్ కనకాల

కథ  చెప్పినప్పుడు థ్రిల్ అయ్యాను  : రోషన్ కనకాల

చిన్నప్పటి నుంచి నటుడు కావాలనేది నా కోరిక. దానికి అమ్మా, నాన్న (యాంకర్ సుమ, రాజీవ్ కనకాల) బాగా సపోర్ట్ చేశారు’ అని చెప్పాడు రోషన్ కనకాల. తను హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘బబుల్‌‌గమ్’. రవికాంత్ పేరేపు దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ,  మహేశ్వరి మూవీస్ సంస్థలు నిర్మించాయి. శుక్రవారం సినిమా విడుదలవుతోన్న సందర్భంగా రోషన్ మాట్లాడుతూ ‘నా బాల్యం అంతా దాదాపుగా తాతగారి (దేవదాస్ కనకాల)  యాక్టింగ్ స్కూల్‌‌లోనే గడిచింది. ఆ తర్వాత లాస్ ఏంజెల్స్, పాండిచ్చేరిలో కోర్స్ చేశా. రవికాంత్ ఈ కథ  చెప్పినప్పుడు థ్రిల్ అయ్యాను.  షూటింగ్‌‌కు నెల ముందు వర్క్ షాప్ చేసుకున్నాం. సీన్ ఎలా చేయాలి, ఎలాంటి ఎమోషన్ కన్వే అవ్వాలి, ఎలాంటి కాస్ట్యూమ్ ఉండాలి లాంటివన్నీ ముందు అనుకున్నాం. 

ఆ ప్రిపరేషన్ చాలా హెల్ప్ అయ్యింది. రవికాంత్ చాలా ఓపెన్‌‌గా ఉంటాడు. ఈ కథ నా ఏజ్ గ్రూప్‌‌కి సంబంధించినది కావడంతో నా ఆలోచనలను కూడా షేర్ చేసుకునేవాడు. మానస పెర్ఫార్మెన్స్ చూసి సర్‌‌‌‌ప్రైజ్ అయ్యా. శ్రీచరణ్ పాకాల ఇంటర్వెల్ బ్లాక్‌‌లో ఇచ్చిన మ్యూజిక్‌‌కి గూస్ బంప్స్ వస్తాయి. ‘ఇజ్జత్’ పాటను చిరంజీవి గారు లాంచ్ చేయడం, అలాగే నాగార్జున గారితో వీడియో చేయడం గొప్పగా అనిపించింది. న్యూ ఏజ్ కంటెంట్‌‌తో వస్తున్న ఈ చిత్రంపై చాలా నమ్మకంగా ఉన్నాం. అమ్మ నాన్న బాగా చేశావ్ అని కాంప్లిమెంట్ ఇవ్వడం హ్యాపీ’ అన్నాడు.