
వరుస క్రేజీ ప్రాజెక్ట్స్‌తో దూసుకెళ్తోంది మాళవిక మోహనన్. సౌత్‌లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఆమె, ఇటీవల ‘యుధ్రా’ అనే హిందీ చిత్రంతో బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ సినిమా ‘రాజాసాబ్’ షూటింగ్ విశేషాలను పంచుకుంది మాళవిక. రొమాంటిక్ హారర్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం ఆనందంగా ఉందని చెప్పింది.
సరైన స్క్రిప్ట్ కోసం ఎదురుచూస్తున్న తనకు ఈ చిత్రంలో చక్కని ప్రాధాన్యత గల పాత్ర లభించిందని, ఇలాంటి సినిమాలో అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని మాళవిక సంతోషం వ్యక్తం చేసింది. ‘షూటింగ్ సగంలో ఉన్నాం.. అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా రెడీ అవుతోంది. ఇక ప్రభాస్ ఇంటి భోజనానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. భోజనం అంటే ఏదో ఒక కూర, బిర్యానీ తెప్పించడం కాదు.. పెద్ద పెద్ద పాత్రల్లో ఒక ఊరికి సరిపోయేంత ఆహారాన్ని ఏర్పాటుచేస్తారు. అంత రుచికరమైన ఫుడ్ గతంలో నేనెప్పుడూ తినలేదు’ అంటూ ప్రభాస్‌పై ప్రశంసలు కురిపించింది మాళవిక. మారుతి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ మరో హీరోయిన్‌గా నటిస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న సినిమా విడుదల కానుంది.