ఇన్నాళ్లు రోడ్లపై.. ఇకపై పార్లమెంటులో గొంతెత్తుతా

ఇన్నాళ్లు రోడ్లపై.. ఇకపై పార్లమెంటులో గొంతెత్తుతా

హైదరాబాద్: బీసీ వర్గానికి చెందిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ, బీసీల బాధలను తప్పకుండా అర్ధం చేసుకుంటారని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆశాభావం వ్యక్తం చేశారు. చట్టసభల్లో బీసీ బిల్లు పెట్టే విధంగా కృషి చేస్తానని పేర్కొన్నారు. ‘‘ బీసీలకు ఒక వేదిక లేక ఇన్ని రోజులు రోడ్లపై ఉద్యమం చేశాం. ఇప్పటి నుంచి మన హక్కులు మనం సాధించు కోవడానికి పార్లమెంటు వేదిక దొరికింది’’ అని తెలిపారు. దేశం మొత్తంలో 75 కోట్ల జనాభా ఉన్న బీసీల పక్షాన గొంతెత్తి పోరాడి, హక్కులను సాధిస్తానన్నారు. కురుమ సోదరులు చాలామంది ఇప్పటికీ కడు బీదరికాన్ని అనుభవిస్తున్నారని తెలిపారు. రాజ్యాంగంలో వారికి రావాల్సిన హక్కుల కోసం పోరాటం చేస్తానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన సందర్భంగా హైదరాబాద్ విద్యా నగర్ లోని బీసీ భవన్ వద్ద తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం ఆధ్వర్యంలో ఆర్.కృష్ణయ్యను సన్మానించారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్, బీసీ ఫ్రంట్ చైర్మన్ గోరిగే మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు..

రెడీ అవుతున్న డ్రాగన్ స్పేస్ స్టేషన్

జగిత్యాలలో భారీగా దొంగనోట్లు స్వాధీనం