మిస్సైల్స్ వదిలే స్టైల్ మార్చనున్న ఐఏఎఫ్

మిస్సైల్స్ వదిలే స్టైల్ మార్చనున్న ఐఏఎఫ్

ఫైటర్ జెట్స్ నుంచి మిస్సైల్స్, బాంబులు వదిలేందుకు భారతీయ వాయుసేన(ఐఏఎఫ్) కొత్త పద్దతిని అనుసరించనుంది. బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ ఆపరేషన్ లో ఇజ్రాయిల్ కు చెందిన ‘క్రిస్టల్ మేజ్’ ఎయిర్ టూ సర్ఫేస్ మిస్సైల్స్ ను ప్రొటొకాల్స్ వల్ల మిరేజ్ 2000 ఫైటర్లు ప్రయోగించకుండా వెనక్కు తీసుకొచ్చాయి. బాలాకోట్ లోని జైషే స్థా వరంపై కనుక స్పైస్ 2000 బాంబులతో పాటు క్రిస్టల్  మేజ్ మిస్సైల్స్ ను వదిలివుంటే ఆపరేషన్ మొత్తం లైవ్ ఫీడ్ వీడియో రూపంలో ఐఏఎఫ్ కు వచ్చేది. క్రిస్టల్ మేజ్ మిస్సైల్స్ లో ఈ టెక్నాలజీ ఉంది. మిస్సైల్ వెళ్లే దిశలో ప్రతి విషయాన్ని లైవ్ లో బేస్ కు చేరవేస్తుంది.

బాలాకోట్ ఆపరేషన్ లో మొత్తం 12 మిరేజ్ 2000 ఫైటర్లను ఐఏఎఫ్ వాడింది. వీటిలో ఆరు ఫైటర్లు క్రిస్టల్ మేజ్ మిస్సైల్స్ ను తీసుకెళ్లాయి. కానీ ప్రొటోకాల్స్ సమస్య వల్ల ప్రయోగించలేదు. మిషన్, వాతావరణ పరిస్థితులను బట్టి వాయుసేన దాడికి కొన్ని ప్రత్యేక పద్దతులను వాడుతుందని పేరు చెప్పడానికి ఇష్టపడని రక్షణ శాఖ ఆఫీసర్ ఒకరు తెలిపారు. ఎయిర్ స్ట్రైక్స్ జరిగి న మరుసటి రోజు విడుదలైన శాటిలైట్ ఫొటోల్లో జైషే నిర్మాణాలు మిగిలివున్నట్లు కనిపించాయి. దీంతో ఆపరేషన్ సక్సెస్ పై పలు వాదనలు వినిపించా యి. వాటన్నిం టినీ ఐఏఎఫ్ ఖండించిం ది. అదే వీడియో ఫుటేజి ఉంటే ఐఏఎఫ్ కు బాగా సపోర్టు
దొరికేది. అయినా స్ట్రైక్స్ తో పాకిస్థా న్ కు గట్టి సమాధానమిచ్చామని రక్షణ శాఖ ఆఫీసర్ పేర్కొన్నారు.