
వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ ఆఫీసర్ పూజా ఖేడ్కర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అధికార దుర్వినియోగం ఆరోపణలు ఎదుర్కొంటున్న పూజా ఖేడ్కర్ తాజాగా.. మరో వివాదంలో ఆమెకు పుణె మున్సిపల్ కార్పొరేషన్ నోటీసులిచ్చింది. పుణెలో లోని పూజా ఖేడ్కర్ ఇంటిని అక్రమించిన స్థలంలో నిర్మించారనీ పీఎంసీ ఎక్రోచ్ మెంట్ డిపార్టుమెంట్ నోటీసులు జారీ చేసింది. పీఎంసీ పరిధిలోని రోడ్డు,ఫూట్ పాత్ ను ఆక్రమించి ఇంటిని నిర్మించడంతో స్థానికులు ఇబ్బందులు కలిగించారని నోటీసులో తెలిపింది.
ఇటీవల అధికార దుర్వినియోగం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ట్రైనీ ఐఏఎస్ ఆఫీసర్ పూజా ఖేడ్కర్, పుణె కలెక్టరేట్ లో అసిస్టెంట్ కలెక్టర్ గా ఉన్న పూజా అధికార దుర్వినియోగంపై కలెక్టర్ ఫిర్యాదు చేయడంతో ఆమెను బదిలీ చేశారు. వివాదంలో చిక్కుకున్న పూజా అభ్యర్థిత్వాన్ని పున పరిశీలించాలని కేంద్రం ఏక సభ్య కమిటీని కూడా నియచింది. ఐఏఎస్ కు సెలక్ట్ అయినప్పుడు సమర్పించిన డాక్యుమెంట్లను మరోసారి పరిశీలించాలని కమిటీకి సూచింది. పూజ దోషిగా తేలితే ఆమెను ఐఏఎస్ క్యాడర్ నుంచి తొలగించవచ్చు.