ఇంటెలిజెన్స్ బ్యూరోలో సెక్యూరిటీ అసిస్టెంట్స్​

ఇంటెలిజెన్స్ బ్యూరోలో సెక్యూరిటీ అసిస్టెంట్స్​

ఇంటెలిజెన్స్ బ్యూరో దేశవ్యాప్తంగా ఉన్న సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరోల్లో డైరెక్ట్ రిక్రూట్‌‌మెంట్ ప్రాతిపదికన సెక్యూరిటీ అసిస్టెంట్/ ఎగ్జిక్యూటివ్, మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి ఆన్‌‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: సెక్యూరిటీ అసిస్టెంట్/ ఎగ్జిక్యూటివ్– 1,521, మల్టీ–టాస్కింగ్ స్టాఫ్(ఎంటీఎస్‌‌)– 150  పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

అర్హతలు: టెన్త్​ ఉత్తీర్ణతతో పాటు స్థానిక భాషపై అవగాహన ఉండాలి. ఎస్‌‌ఏ/ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు 25 ఏళ్లు, ఎంటీఎస్‌‌ పోస్టులకు 27 ఏళ్లు మించకూడదు. టైర్-1, టైర్-2, టైర్-3 పరీక్షలో వచ్చిన మెరిట్​ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తులు: అభ్యర్థులు నవంబర్​ 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు www.mha.gov.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.