
2023 –2027 కాలానికి మెన్స్ క్రికెట్ ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్ను ఐసీసీ విడుదల చేసింది. 12 దేశాలకు సంబంధించిన క్రికెట్ కాలెండర్ ను ప్రకటించింది. మెన్స్ FTPలో భాగంగా అన్ని జట్లు 777 మ్యాచులు ఆడతాయి. ఇందులో 173 టెస్టులు, 281 వన్డేలు, 323 టీ20లు ఉన్నాయి. ప్రస్తుత ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్లో 694 మ్యాచులే జరగ్గా..2023-27 కాలానికి 83 మ్యాచులు అధికంగా జరగనుండటం విశేషం. 2023లో వన్డే వరల్డ్ కప్ భారత్లో జరగనుంది. అయితే వరల్డ్ కప్ ముందు టీమిండియా 27 వన్డేలు ఆడబోతుంది. దీంతో ప్రపంచ కప్ కోసం భారత్కు ప్రాక్టీస్ లభించే వీలుంది. మొత్తం మెన్స్ FTPలో అన్ని ఫార్మాట్లకు సరైన ప్రాధాన్యం దక్కేలా కాలెండర్ను ఐసీసీ రూపొందించింది.
Men’s Future Tour Program for 2023-27 announced ?
— ICC (@ICC) August 17, 2022
Details ?https://t.co/33MN4USU6L
టీమిండియా షెడ్యూల్..
FTPలో భాగంగా టీమిండియా ఇంగ్లాండ్, ఆసీస్లతో 5 మ్యాచుల టెస్ట్ సిరీస్లో పాల్గొననుంది. ఇక 2023 నుంచి 27 వరకు భారత్ మొత్తం 44 టెస్టులు, 63 వన్డేలు, 76 టీ20లు ఆడనుంది. 2023–25 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్‌లో ఇంగ్లాండ్ అత్యధికంగా 22 టెస్టులు ఆడనుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా 21 టెస్టులు, భారత్ 20 టెస్టులు ఆడనున్నాయి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ మూడో, నాల్గో ఎడిషన్లో భాగంగా ఆసీస్, ఇంగ్లాండ్, భారత్ ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లలో పాల్గొనున్నాయి.
భారత్లో 2026 టీ20 వరల్డ్ కప్
ఈ నాలుగేళ్ల సైకిల్లో వన్డే క్రికెట్ ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతాయి. అలాగే 2 సార్లు మెన్స్ టీ20 వరల్డ్ కప్లు, రెండు WTC ఫైనళ్లు జరుగుతాయి. 2024 టీ20 ప్రపంచకప్‌కు వెస్టిండీస్, USA ఆతిథ్యం ఇస్తాయి. 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్లో జరగనుంది. ఇక 2026 టీ20 వరల్డ్ కప్ భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. 2027 వన్డే వరల్డ్ కప్ సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియాలో జరగనుంది.