ఐసీసీ కీలక ప్రకటన..అంతర్జాతీయ క్రికెట్‌లో ట్రాన్స్‌జెండర్లపై నిషేధం

ఐసీసీ కీలక ప్రకటన..అంతర్జాతీయ క్రికెట్‌లో ట్రాన్స్‌జెండర్లపై నిషేధం

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) కీలక ప్రకటన చేసింది. అంతర్జాతీయ క్రికెట్ లోకి ట్రాన్స్ జెండర్లపై నిషేధం విధించింది. ఐసీసీ(ICC) కొత్త నిబంధనల ప్రకారం.. మగ నుంచి ఆడగా మారిన యుక్త వయస్సు వచ్చిన ఏ ఆటగాడు అయిన మహిళల అంతర్జాతీయ క్రికెట్ లో పాల్గొనడానికి అనుమతించమని స్పష్టం చేసింది. 

ICC సెక్సువల్ క్వాలిఫికేషన్ నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. ఈ ఏడాది (2023) ప్రారంభంలో అంతర్జాతీయ క్రికెట్ లోకి ప్రవేశించిన మొదటి లింగ మార్పిడి క్రీడాకారిణిగా గుర్తింపు పొందిన డేనియల్ మేక్ గాహేను మహిళల అంతర్జాతీయ క్రికెట్ లో ఆడొద్దని నిషేధించింది. 

మంగళవారం (నవంబర్21) ఐసీసీ బోర్డు ఆమోదించిన కొత్త నిబంధనల ప్రకారం.. మగ నుంచి ఆడగా మారిన ఏ ఆటగాడు ఎలాంటి లింగ పునర్వ్యవస్థీకరణ చికిత్సతో సంబంధం లేకుండా మహిళల అంతర్జాతీయ క్రికెట్ లో పాల్గొనడానికి అనుమతించబడరని ప్రకటించింది. 

ఆస్ట్రేలియాకు చెందిన 29యేళ్ల బ్యాటర్ మెక్ గేహె.. 2021లో లింగమార్పిడి చేయించుకొని మహిళగా మారాడు.  ఆ తర్వాత 2023లో కెనడా తరపున ఆడుతుంది. ఇప్పటివరకు ఆరు టీ 20 మ్యాచ్ లు ఆడింది. 19.66 సగటుతో 95.9. స్ట్రై్క్ రేట్ తో 118 పరుగులు చేసింది. ఇదంతగా గత ఐసీసీ విధానాల ప్రకారం మెక్ గేహె అంతర్జాతీయ క్రికెట్ లో ఆడింది.

ఇటీవల ఐసీసీ కొత్త విధానాలను ప్రకటించింది. మహిళల ఆట సమగ్రత, భద్రత, వంటి పలు అంశాలను పరిగణనలోకి తీసుకొని అంతర్జాతీయ క్రికెట్ లోకి లింగ మార్పిడి చేసుకున్న మహిళలు ఆడటంపై నిషేధం విధించింది. అయితే దేశీయంగా లింగ అర్హాత అనేది ఆయా దేశాలకు సంబంధించిన బోర్డు పరిధిలోనిది. అది వారిష్టం.. అని ఐసీసీ తెలిపింది.