ODI World Cup 2023: వరల్డ్ కప్ లో అత్యధిక వికెట్ల వీరులు వీరే.. భారత్ నుంచి ఆ ఇద్దరు

ODI World Cup 2023: వరల్డ్ కప్ లో  అత్యధిక వికెట్ల వీరులు వీరే.. భారత్ నుంచి ఆ ఇద్దరు

క్రికెట్ లో బౌలర్లకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. బ్యాటర్ మ్యాచుని గెలిపించాలంటే గంటల తరబడి క్రీజ్ లో గడపాలి గాని బౌలర్లకు మాత్రం ఒక్క ఓవర్ చాలు. కీలక సమయంలో ఒక మెయిన్ వికెట్ తీసిన అది మ్యాచుని మలుపు తిప్పుతుంది. కొంతమంది బౌలర్లయితే ఒక్క ఓవర్ లో మూడు, నాలుగు వికెట్లు తీసి మ్యాచుని ఏకపక్షం చేస్తారు. వరల్డ్ కప్ లాంటి టోర్నీల్లో ఇలాంటి ప్రదర్శన జట్టుపై చాలా ప్రభావం చూపిస్తుంది. మరి వరల్డ్ కప్ చరిత్రలో  ఇప్పటివరకు సత్తా చాటిన బౌలర్లని ఒకసారి ఇప్పుడు చూద్దాం. 
             
1) గ్లెన్ మెగ్రాత్:

ప్రపంచంలో గ్రేట్ పేస్ బౌలర్లలో ఒకడిగా పేరొందిన మెగ్రాత్.. వరల్డ్ కప్ వచ్చిందంటే చెలరేగిపోతాడు. 1999,2003,2007 ఆసీస్ వరుసగా మూడు ప్రపంచ కప్ లు గెలవడంతో కీలక పాత్ర పోషించాడు. 2007 లో అత్యధిక  వికెట్లు(33) తీసినందుకు గాను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. మొత్తం 71 వికెట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
 
2)ముత్తయ్య మురళీధరన్:

ప్రపంచంలో బెస్ట్ స్పిన్నర్ గా కొనసాగిన మురళీధరన్.. వరల్డ్ కప్ లో మొత్తం 68 వికెట్లు తీసి రెండో స్థానంలో ఉన్నాడు. 1996-2007 వరకు శ్రీలంక తరపున మొత్తం నాలుగు వరల్డ్ కప్ లు ఆడాడు. వీటిలో 1996 లో శ్రీలంక విజయం సాధించింది. 

3)లసిత్ మలింగా:

శ్రీలంక యార్కర్ల వీరుడు వరల్డ్ కప్ లాంటి టోర్నీ వచ్చిందంటే రెచ్చిపోయి ఆడతాడు. 2007 లో వరుసగా నాలుగు వికెట్లు తీసి సంచలనం సృష్టించిన మలింగా.. 2011, 2015, 2019 వరల్డ్ కప్ ఆడాడు. మొత్తం 56 వికెట్లు తీసిన మలింగా మూడో స్థానంలో ఉన్నాడు. 

4)వసీం అక్రమ్:

పాకిస్థాన్  స్వింగ్ బౌలర్ వసీం అక్రమ్ 1987,1992 1996, 1999, 2003 వరల్డ్ కప్ లో  ప్రాతినిధ్యం వహించాడు. వీటిలో పాక్ 1992 వరల్డ్ కప్ గెలుచుకుంది. 18 వికెట్లతో అక్రమ్ ఈ వరల్డ్ కప్ లో టాప్ వికెట్ టేకర్ గా నిలిచాడు. ఓవరాల్ గా 55 వికెట్లతో ఈ లిస్టులో నాలుగో స్థానం దక్కింది. 

5) మిచెల్ స్టార్క్:

ప్రస్తుత ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఆడింది రెండు వరల్డ్ కప్ లే అయినా టాప్ వికెట్ టేకర్ గా నిలిచాడు. వీటిలో 2015 లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. స్వదేశంలో జరిగిన ఈ వరల్డ్ కప్ ఆస్ట్రేలియా గెలుచుకుంది. మొత్తం 49 వికెట్లతో స్టార్క్ టాప్ 5 లో స్థానం సంపాదించాడు.

 
ఇక వీరితో పాటు శ్రీలంక పేసర్ చమిందా వాస్, జహీర్ ఖాన్, శ్రీనాథ్, ఇమ్రాన్ తాహీర్, బోల్ట్ తర్వాత స్థానాల్లో నిలిచారు. భారత్ నుంచు టాప్ 10 లో జహీర్, శ్రీనాథ్ కి మాత్రమే చోటు దక్కింది. జహీర్ 44 వికెట్లతో 7 వ స్థానంలో, శ్రీనాథ్ 44 వికెట్లతో 8 వ స్థానంలో నిలిచారు.                                                    

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by CricTracker (@crictracker)