
దుబాయ్: గాయంతో సౌతాఫ్రికా టూర్‌కు దూరమైన ఇండియా వైట్‌బాల్ కెప్టెన్ రోహిత్ శర్మ, టెస్ట్ సారథి విరాట్ కోహ్లీ టెస్ట్ ర్యాంక్‌ల్లో ఎలాంటి మార్పుల్లేవు. ఐసీసీ బుధవారం రిలీజ్ చేసిన లేటెస్ట్ ర్యాంకింగ్స్‌లో రోహిత్ (781 పాయింట్స్) ఐదో ప్లేస్‌లో ఉండగా, విరాట్ (740) తొమ్మిదో ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. మయాంక్ అగర్వాల్ (710) ఓ ప్లేస్ దిగజారి 13వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఆసీస్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ (924), జో రూట్ (881), స్టీవ్ స్మిత్ (871), విలియమ్సన్ (862) వరుసగా టాప్–4 ర్యాంక్‌ల్లో ఉన్నారు. బౌలింగ్‌లో స్పిన్నర్ అశ్విన్ (861) సెకండ్ ర్యాంక్ నిలబెట్టుకున్నాడు. ఇండియా నుంచి మరే బౌలర్‌కు టాప్–10లో చోటు దక్కలేదు. ఆల్‌రౌండర్లలో అశ్విన్ (356), జడేజా (332) వరుసగా 2,3 ర్యాంక్‌ల్లో ఉన్నారు.