దుబాయ్: టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్... ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో 18 ప్లేస్‌లు ఇంప్రూవ్ చేసుకోగా, కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండు ప్లేస్‌లు డౌన్ అయ్యాడు. బుధవారం రిలీజ్ చేసిన లేటెస్ట్ లిస్ట్‌లో రాహుల్ (598 పాయింట్స్).. 31వ ర్యాంక్‌కు ఎగబాకాడు. విరాట్ (747) తొమ్మిదో ప్లేస్‌కు పడిపోయాడు. హిట్‌మ్యాన్ రోహిత్ (789) ఐదో ర్యాంక్‌లో ఉండగా, మయాంక్ అగర్వాల్ (718) 11వ ప్లేస్‌కు చేరాడు. రిషబ్ పంత్ (665).. 16వ, పుజారా (635)... 22వ ర్యాంక్‌లకు పడిపోయారు. అయితే రహానె (621) మాత్రం రెండు ప్లేస్‌లు మెరుగై 25వ ర్యాంక్ సాధించాడు. ఆసీస్ ప్లేయర్ లబుషేన్ (915) నంబర్‌వన్ ప్లేస్‌లో ఉన్నాడు. బౌలింగ్‌లో రవిచంద్రన్ అశ్విన్ (873) రెండో ర్యాంక్‌లో ఉండగా, బుమ్రా (781).. 9వ ర్యాంక్‌లో నిలిచాడు. మహ్మద్ షమీ (704).. 17వ ప్లేస్సాధించాడు. ఒక ర్యాంక్ డౌన్ అయిన ఉమేశ్ యాదవ్ (570).. 32వ ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. ఆసీస్ స్టార్ ప్యాట్ కమిన్స్ (902) టాప్ ప్లేస్‌లో కంటిన్యూ అవుతున్నాడు.
