వరల్డ్ కప్ క్వాలిఫయర్‌లో మరో సంచలనం.. టోర్నీ నుండి జింబాబ్వే ఔట్

వరల్డ్ కప్ క్వాలిఫయర్‌లో మరో సంచలనం.. టోర్నీ నుండి జింబాబ్వే ఔట్

జింబాబ్వే వేదికగా జరుగుతోన్న వరల్డ్ కప్ క్వాలిఫయర్‌ టోర్నీ సంచనాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. పసికూన జట్లుగా తేలిగ్గా తీసుకున్న స్కాట్లాండ్, నెదర్లాండ్స్, ఓమన్ వంటి జట్లు.. మేటి జట్లకు ఊహించని షాకులిస్తున్నాయి. ఇప్పటికే రెండు సార్లు వరల్డ్ కప్ విజేత వెస్టిండీస్.. టోర్నీ నుండి తప్పుకోగా.. ఇప్పుడు జింబాబ్వే పోరాటం కూడా ముగిసింది. స్కాట్లాండ్ తో జరిగిన మ్యాచులో జింబాబ్వే 31 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఫలితంగా వరల్డ్ కప్ రేసు అధికారికంగా తప్పుకుంది. 

తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. ఆల్‌రౌండర్ మైకెల్ లీస్క్ (48; 34 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులు) రాణించడంతో ఆమాత్రం స్కోరైనా చేయగలిగారు. జింబాబ్వే బౌలర్లలో సీన్ విలియమ్స్ 3 వికెట్లు పడగొట్టగా.. చటారా రెండు, నగర్వా ఒక తీసుకున్నారు. 

అనంతరం 235 పరుగుల సాధారణ లక్ష్యాన్ని కూడా జింబాబ్వే బ్యాటర్లు చేధించలేకపోయారు. ఆల్‌రౌండర్ ర్యాన్ బర్ల్ 83 (84 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్) పరుగులతో రాణించినా.. జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడు. అతనికి మరో ఎండ్ నుంచి  సరైన సహకారం లభించలేదు. ఓవర్ కాన్ఫిడెంట్ వారిని దెబ్బతీసింది. స్కాట్లాండ్ బౌలర్లలో క్రిస్ సోలె 3 వికెట్లు పడగొట్టగా.. మెక్ ముల్లెన్ రెండు, మైకెల్ లీస్క్ రెండు వికెట్లు తీసుకున్నారు. ఈ విజయంతో స్కాట్లాండ్ సూపర్ 4కు అర్హత సాధించగా... జింబాబ్వే వరల్డ్ కప్ రేసు నుంచి తప్పుకుంది.