నారాయణపేట జిల్లాలో గుండెపోటుతో ఐసీడీఎస్ సూపర్ వైజర్ మృతి

నారాయణపేట జిల్లాలో గుండెపోటుతో ఐసీడీఎస్ సూపర్ వైజర్ మృతి
  • సీడీపీవో వేధింపులతోనేనని పోలీసులకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు 

మద్దూరు, వెలుగు: నారాయణ పేట జిల్లా మద్దూరు ఐసీడీఎస్​ సూపర్ వైజర్  నీనావత్  నీలాబాయి(50) మంగళవారం గుండెపోటుతో చనిపోయారు. మహబుబ్ నగర్ లో నివాసం ఉంటున్న నీలాబాయి మండలంలోని నిడ్జింత సెక్టార్ లో పని చేస్తున్నారు. సోమవారం ఉదయం డ్యూటీకి వెళ్లేందుకు రెడీ అవుతుండగా, గుండెపోటు వచ్చింది.

కుటుంబ సభ్యులు ఆమెను హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లగా, అక్కడ ట్రీట్ మెంట్  తీసుకుంటూ మంగళవారం తెల్లవారుజామున చనిపోయనట్లు కుటుంబసభ్యులు తెలిపారు. కాగా, ఇన్​చార్జి సీడీపీవో వెంకటేశ్వరమ్మ దామరగిద్ద మండలం క్యాతన్ పల్లి సెక్టార్  బాధ్యతలు అప్పగించి, వేధింపులకు పాల్పడేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. సీడీపీవో వేధింపులతోనే గుండెపోటు వచ్చిందని కుటుంబసభ్యులు మహబూబ్ నగర్  పోలీసులకు ఫిర్యాదు చేశారు.