
హైదరాబాద్, వెలుగు : కూలింగ్ సొల్యూషన్‌ల ప్రొవైడర్ ఐస్ మేక్ రిఫ్రిజిరేషన్ లిమిటెడ్ ఈ ఏడాది మార్చితో ముగిసిన నాలుగో క్వార్టర్ నికర లాభాన్ని వార్షికంగా 65.24శాతం పెంచుకుంది. ఈసారి రూ.14.27 కోట్ల లాభం వచ్చింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో రూ.8.63 కోట్ల లాభం సంపాదించింది. ఈ వృద్ధి ప్రధానంగా బలమైన అమ్మకాల ద్వారా సాధ్యపడింది. ఆదాయం 22.61శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో రూ.114.28 కోట్లతో పోలిస్తే రూ.140.14 కోట్లకు చేరుకుంది. 2024 పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఆదాయం రూ. 379 కోట్ల కు చేరుకుంది. 2023 ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో రూ. 313.32 కోట్లు వచ్చాయి. ఈసారి రూ. 41.39 కోట్ల ఇబిటా వచ్చింది. 2024 ఆర్థిక సంవత్సరంలో ఒక్కో షేరుకు రూ. 2 డివిడెండ్ చెల్లించనుంది.