
రెక్జావిక్: ఐరోపాకు చెందిన ద్వీప దేశం ఐస్‌లాండ్ వరుస భూ ప్రకంపనలతో వణికిపోతోంది. సుమారు 14 గంటల వ్యవధిలో 800 ప్రకంపనలను చవిచూసింది. రెక్జానెస్ ప్రాంతంలో ఇవి చోటుచేసుకున్నాయి. దాంతో ఐస్‌లాండ్ శుక్రవారం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. నిన్న సాయంత్రం రాజధాని నగరం రెక్జావిక్‌కు 40 కిలోమీటర్ల దూరంలో రెండు బలమైన ప్రకంపనలు సంభవించాయి. వాటి తీవ్రత రిక్టర్ స్కేల్‌పై అత్యధికంగా 5.2 గా నమోదైంది. దాంతో సమీప ప్రాంతాల్లో రహదారులు ధ్వంసం కావడంతో రాకపోకలను నిలిపివేశారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు సుమారు 800 ప్రకంపనలు నమోదయ్యాయి.