మెగా ప్రిన్సెస్ క్లీంకారకు.. స్టార్ అల్లు అర్జున్ అదిరిపోయే గిఫ్ట్

మెగా ప్రిన్సెస్ క్లీంకారకు.. స్టార్ అల్లు అర్జున్ అదిరిపోయే గిఫ్ట్

RRR మూవీతో రామ్ చరణ్(Ram Charan )  క్రేజ్ ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించింది. దీంతో రామ్ చరణ్ హవా ఎల్లలు దాటేసింది. ఇటీవల చరణ్.. ఉపాసన దంపతులకు కూతురు పుట్టిన విషయం తెలిసేందే..లేటెస్ట్ గా స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) ..ఒక అదిరిపోయే గిఫ్ట్ ను చెర్రీ కూతురు క్లీంకార కు ఇచ్చినట్లు తెలుస్తోంది.  

రీసెంట్ గా మెగా ప్రిన్సెస్ క్లీంకార(Klin Kaara) బారసాల ఫంక్షన్ వైభవంగా..మెగా ఇంట్లో ఫుల్ హ్యాపీనెస్ తీసుకొచ్చింది. ఈ ఫంక్షన్ కు అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ హాజరయ్యారు. అయితే అల్లు అర్జున్ తన కోడలైన మెగా ప్రిన్సెస్ క్లీంకార కు బంగారు పలక గిఫ్ట్ గా ఇచ్చారని సమాచారం. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా తగ్గేదేలే అంటూ..సోషల్ మీడియాలో కామెంట్స్ తెలుపుతున్నారు. 
ఈ బంగారు పలక..సూపర్ కాస్ట్లీ ఉంటుందని తెలుస్తోంది. 

ఎన్టీఆర్ కూడా..ఒక అదిరిపోయే గిఫ్ట్ ను  చెర్రీ కూతురు క్లీంకార కు ఇచ్చిన విషయం తెలిసేందే. చరణ్, ఉపాసన, క్లీంకార పేర్లతో ఉన్న గోల్డ్ డాలర్స్ ను ప్రత్యేకంగా డిజైన్ తో ..చాలా స్పెషల్ గా చేయించిన ఆ గిఫ్ట్ ను NTR  అభయ్ రామ్, భార్గవ్ రామ్ చేతుల మీదుగా చెర్రీ దంపతులకు అందించారు. కాగా క్లీంకార పేరును లలితా సహస్రనామం నుంచి తీసుకున్నాం అంటూ..ఈ పేరు ఒక ఆధ్యాత్మికతను మేలుకొలిపే పరివర్తనను.. స్వచ్ఛమైన శక్తిని ఈ పేరు సూచిస్తుంది అని ఉపాసన రీసెంట్ గా ట్వీట్ చేశారు.