మళ్లీ వస్తున్న టాటా సియెరా

మళ్లీ వస్తున్న టాటా సియెరా

1990లో భారత రోడ్లను శాసించిన పాపులర్ ఎస్‌‌‌‌యూవీ టాటా సియెరా, 30 ఏళ్ల తర్వాత మళ్లీ వస్తోంది. ముంబైలో ఫస్ట్‌‌‌‌ లుక్‌‌‌‌ను టాటా మోటార్స్ ఆవిష్కరించింది. ఈ సందర్భంగా కంపెనీ ఎండీ శైలేష్ చంద్ర మాట్లాడుతూ, “ఇది కేవలం ఎస్‌‌‌‌యూవీ మాత్రమే కాదు, ఒక లెజెండ్. కొత్త తరం కోసం మళ్లీ రూపుదిద్దుకుంది” అని అన్నారు. టాటా సియెరా పెట్రోల్‌‌‌‌ / డీజిల్ వెర్షన్‌‌‌‌ను తీసుకొచ్చే ముందే,  2020లో ఈవీ కాన్సెప్ట్‌‌‌‌ను,  2023లో ఆటో ఎక్స్‌‌‌‌పోలో ఈవీ వెర్షన్‌‌‌‌ను కంపెనీ ప్రదర్శించింది.