కృష్ణా నదిపై భారీ వంతెనకు కేంద్రం ఆమోదం

కృష్ణా నదిపై భారీ వంతెనకు కేంద్రం ఆమోదం

కృష్ణా నదిపై మరో భారీ వంతెనకు కేంద్ర సర్కార్ ఆమోదం తెలిపింది. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణానదిపై 1082 కోట్ల రూపాయలతో బ్రిడ్జిని నిర్మిస్తున్నామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. దేశంలోనే తొలిసారిగా కేబుల్, సస్పెన్షన్ ఐకానిక్ బ్రిడ్జిగా నిర్మాణం చేస్తామన్నారు. బ్రిడ్జికి సంబంధించిన డిజైన్ ఫోటోలను నితిన్ గడ్కరీ ట్విట్టర్ లో పోస్టు చేశారు. 30 నెలల్లో ఈ నిర్మాణాన్ని పూర్తి చేయనున్నట్లు గడ్కరీ వెల్లడించారు. వంతెనలో పాదచారుల మార్గం గాజుతో ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు. వంతెనలో గోపురం ఆకారంలో పైలాన్‌, లైటింగ్ వ్యవస్థ ఉంటుందన్నారు. 

కాగా, చుట్టూ నల్లమల అడవులు, ఎత్తయిన కొండలు, శ్రీశైలం రిజర్వాయర్‌ పరిసరాలతో ఈ వంతెన మంచి పర్యాటక ప్రాంతంగా మారనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ల మధ్య సోమశిల దగ్గర కృష్ణానదిపై నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే... హైదరాబాద్ –తిరుపతి మధ్య 80 కిలోమీటర్ల దూరం తగ్గనుంది.–