రైతులకు ఈ కార్డ్ ఉంటే.. లక్షల లోన్స్ గ్యారెంటీ, ఫ్రీ ఇన్సూరెన్స్ 

రైతులకు ఈ కార్డ్ ఉంటే.. లక్షల లోన్స్ గ్యారెంటీ, ఫ్రీ ఇన్సూరెన్స్ 

 వ్యవసాయంలో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న రైతుల కోసం  కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అనేక సంక్షేమ పథకాలను ప్రారంభించింది. వడ్డీ వ్యాపారుల దగ్గర ఎక్కువ వడ్డీకి రుణాలు తీసుకొని రైతులు అప్పుల ఊబిలఓ పడికూడదనే లక్ష్యంతో కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం అములుచేస్తోంది. తక్కువ వడ్డీ, సెక్యూరిటీ లేకుండా రూ.లక్ష 60 వేల వరకు షార్ట్ టర్మ్ లోన్స్ ఇస్తారు. ఈ కిసాన్ క్రెడెట్ కార్డ్ కు అప్లై చేసుకోవడం కూడా ఈజీ. నేడు లక్షలాది మంది రైతులు కేసీసీ ద్వారా రుణాలు పొందారు. వ్యవసాయంతో పాటు పశుపోషణ, చేపల పెంపకానికి కూడా కిసాన్ క్రెడిట్ కార్డ్ రుణాన్ని అందజేస్తున్నారు. పంటకాలం ఆధారంగా అప్పు చెల్లించే అవకాశం ఉంటుంది. బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవకసరం కూడా లేదు KCC ద్వారా ఇంట్లో కూర్చొనే లోన్ పొందవచ్చు. 


కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం కింద రైతు 5 సంవత్సరాలాకు 4 శాతం వడ్డీతో రూ.3 లక్షల వరకు లోన్ పొందవచ్చు.  లోన్ తోపాటు రైతుకు ఇన్సూరెన్స్ స్కీం కూడా వస్తుంది. ఈ కార్డ్ కు అప్లై చేసుకోవడం కూడా చాలా సులభం. రైతులు తమ ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్ కాపీ, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, భూమి పట్టా జీరాక్స్ ఇచ్చి ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు. pmkisan.gov.in లో కిసాన్ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ ఫాంను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 

 

ALSO READ :- అడ్మిషన్లు తీసుకోవద్దు.. కాలేజీలకు ఇంటర్ బోర్డు హెచ్చరిక