విదేశాల్లో ఉన్నవారు ముందుకొస్తే.. ఐటీని మరింత అభివృద్ధి చేస్తాం

విదేశాల్లో ఉన్నవారు ముందుకొస్తే.. ఐటీని మరింత అభివృద్ధి చేస్తాం

ఒకప్పుడు అభివృద్ధికి దూరంగా ఉండే ఆదిలాబాద్.. ఇప్పుడు ఐటీ మ్యాప్ లో కనిపిస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఐటీ టవర్ కోసం 5 ఎకరాల భూమి, రూ. కోటిన్నర నిధులు మంజూరు చేస్తామని ఈ సందర్భంగా కేటీఆర్ హామీ ఇచ్చారు. BDNT కంపెనీ ఆధునీకరణకు నిధులు ఇస్తామన్న ఆయన.. ఆదిలాబాద్ లో ఐటీ కంపెనీ ఏర్పాటు చేసి 120మందికి ఉపాధి కల్పించడం సంతోషమన్నారు. ద్వితీయ శ్రేణి పట్టణాల్లో టాలెంట్ ను గుర్తించి అవకాశాలు కల్పిస్తామని స్పష్టంచేశారు.

సీసీఐ ఫ్యాక్టరీ రీఓపెన్ కి చాలా ప్రయత్నాలు చేశామన్న మంత్రి కేటీఆర్... అన్ని రకాలుగా సహకరిస్తామని కేంద్రాన్ని ఆడిగామన్నారు. ప్రయివేట్ లో సిమెంట్ కంపెనీలు లాభాల్లో నడిచినపుడు.. అన్ని సౌకర్యాలు ఉన్న సీసీఐ ఎందుకు ప్రారంభించడం లేదని ప్రశ్నించారు. విదేశాల్లో ఉన్నవారు ముందుకొస్తే... ఆదిలాబాద్ లో ఐటీ మరింత అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ఆదిలాబాద్ అందమైన ఆహ్లాదకరమైన ప్రాంతమన్న మంత్రి... టూరిజం ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉందని సూచించారు.