టూల్స్ గాడ్జ్ ట్స్ : డోర్​ తెరిస్తే.. ఫోన్​కి నోటిఫికేషన్​​!

టూల్స్ గాడ్జ్ ట్స్ : డోర్​ తెరిస్తే.. ఫోన్​కి నోటిఫికేషన్​​!

బ్యాచిలర్స్​, ట్రావెలర్స్​.. బట్టలు ఉతకడాన్ని చాలా పెద్ద పని అనుకుంటారు. అలాంటివాళ్లు ఈ మినీ వాషింగ్ మెషిన్​ని వాడుకుంటే సరిపోతుంది.  పిల్లల్లో దాగి ఉన్న క్రియేటివిటీని బయట పెట్టాలంటే.. చిన్న చిన్న డీఐవై(డు ఇట్​ యువర్​సెల్ఫ్​)చేయిస్తుండాలి. అలాంటివాటికోసం హీట్​ గన్​ బెస్ట్‌‌‌‌ ఛాయిస్. ఇంటికి తాళం వేసి ఆఫీస్​కి వెళ్లినా, ఊరెళ్లినా ధ్యాసంతా ఇంటిపైనే ఉంటుంది. అలాంటివాళ్లు ఒక సెన్సర్​ని బిగించుకుంటే చాలు. ఎవరైనా ఇంటి డోర్ తెరిస్తే వెంటనే ఫోన్​కి నోటిఫికేషన్​ వస్తుంది. ​ ​ 

టర్బైన్ వాషింగ్ మెషిన్

హాస్టల్​, రూమ్​ల్లో ఉండే బ్యాచిలర్స్​లో చాలామంది బట్టల్ని లాండ్రీ షాపుల్లో ఇచ్చి ఉతికించుకుంటుంటారు. చొక్కాలు, ప్యాంట్స్​ వరకు ఓకే. కానీ.. చేతిరుమాళ్లు, టవళ్లు, సాక్సులు ఉతుక్కోవడమెలా? వాటిని ఉతకడం కూడా ఇబ్బందే వాళ్లకు. అలాంటి వాళ్లకోసమే యాన్​స్టార్​ అనే కంపెనీ మినీ అల్ట్రాసోనిక్ టర్బైన్ వాషింగ్ మెషిన్​ తయారుచేసింది. ఇది ట్రావెలింగ్​ చేసేవాళ్లకు కూడా బాగా పనికొస్తుంది. ఒక బకెట్​లో నీళ్లు, డిటర్జెంట్​ వేసి.. ఈ గాడ్జెట్​ని అందులో ఫిక్స్​ చేయాలి. తర్వాత ఉతకాల్సిన బట్టలు వేసి ఆన్ చేస్తే చాలు. ఇది ఒకేసారి కిలో బట్టలు ఉతుకుతుంది. ఇందులో ఉండే మోటార్​ క్లాక్​వైజ్​, యాంటీ క్లాక్​ వైజ్​ కూడా తిరుగుతుంది. అరగంట ఉతికాక ఆటోమెటిక్​గా షట్‌‌‌‌డౌన్ అవుతుంది.                                                                            

ధర: 999 రూపాయలు

వైర్​లెస్​ మైక్రోఫోన్​

టెక్నాలజీ డెవలప్​ అయ్యాక చాలామంది సోషల్​ మీడియాలో యాక్టివ్​గా ఉంటున్నారు. అందుకోసం వీడియోలు తీసి పోస్ట్‌‌‌‌ చేస్తున్నారు. ఇంకొంతమంది మెమరీస్​ కోసం వీడియోలు తీసుకుంటున్నారు. ఇలాంటి ఏ సందర్భంలో అయినా.. మాటలు రికార్డ్‌‌‌‌ చేయాలంటే ఫోన్​లో ఉండే మైక్రోఫోన్​ సరిపోదు. అందుకోసం ప్రత్యేకంగా మైక్​లు కొనాల్సి ఉంటుంది. అలాంటివాళ్లకు ఇది బెస్ట్‌‌‌‌ మైక్​. గ్రెనరో కంపెనీ తెచ్చిన ఈ మైక్​ని మొబైల్​కి కనెక్ట్‌‌‌‌ చేసుకుని వాడుకోవచ్చు. అందుకోసం ముందుగా మొబైల్​కి ఉండే టైప్–సి లేదా మైక్రో యూఎస్​బీ పోర్ట్‌‌‌‌కి రిసీవర్​ని కనెక్ట్‌‌‌‌ చేయాలి. ఈ రీసీవర్​ నుంచి 20 మీటర్ల వరకు మైక్​ పనిచేస్తుంది. ఈ సెట్​లో ఒక ఛార్జింగ్​ కేస్​తో పాటు రెండు మైక్​లు, ఒక రిసీవర్​ ఉంటాయి. ఐ–ఫోన్​, ఆండ్రాయిడ్​ ఫోన్లకి సపోర్ట్‌‌‌‌ చేస్తుంది. ఇందులో ఇంటెలిజెంట్ నాయిస్ రిడక్షన్ చిప్‌‌‌‌ ఉంటుంది. ఇన్​​డోర్‌‌‌‌, అవుట్‌‌‌‌డోర్‌‌‌‌ ఎక్కడున్నా దీన్ని వాడొచ్చు. మైక్రోఫోన్​ని రెండు గంటలు ఛార్జ్​ చేస్తే ఎనిమిది గంటల వరకు వాడుకోవచ్చు. కనెక్ట్ చేయడం కూడా చాలా ఈజీ.

ధర: 2,559 రూపాయలు

స్మార్ట్‌‌‌‌ డోర్​ సెన్సర్​

సిటీల్లో దొంగల బెడద మరీ ఎక్కువగా ఉంది. అలాగని సెక్యూరిటీ సిస్టమ్​ పెట్టించుకునే స్థోమత అందరికీ ఉండదు. అలాంటివాళ్లకు ఇది బెస్ట్‌‌‌‌ గాడ్జెట్‌‌‌‌. దీన్ని హోమ్​మేట్​ అనే కంపెనీ తెచ్చింది. సెట్​లో రెండు గాడ్జెట్స్​ ఉంటాయి. ఒకదాన్ని డోర్​కి, మరోదాన్ని డోర్‌‌‌‌‌‌‌‌కి ఆనుకుని ఉన్న గోడ లేదా చెక్కకు స్టిక్​ చేయాలి. తర్వాత ఇందులో రెండు ఏఏఏ బ్యాటరీలు వేసి, వైఫైతో కనెక్ట్‌‌‌‌ చేయాలి. ఈ గాడ్జెట్‌‌‌‌ని ఆండ్రాయిడ్​, యాపిల్​ డివైజ్​లు అన్నింటికీ యాప్​ ద్వారా కనెక్ట్‌‌‌‌ చేసుకోవచ్చు. దీన్ని తలుపులు, కిటికీలు, క్యాబినెట్‌‌‌‌లు, డ్రాయర్లు.. ఇలా ఎక్కడైనా పెట్టుకోవచ్చు. తలుపు తెరిచిన, మూసిన ప్రతిసారి ఫోన్​కి పుష్ నోటిఫికేషన్‌‌‌‌ వస్తుంది. 

ధర: 1,330 రూపాయలు

మినీ హీట్​ గన్​

ఇంట్లో గోడలకు పిల్లలు ప్లాస్టిక్​ స్టిక్కర్లు అతికిస్తుంటారు. వాటిని తీస్తే.. వాటితోపాటు పెయింట్​ కూడా ఊడిపోతుంది. అలాంటి వాటిని హీట్​గన్​తో వేడి చేసి తీస్తే పని ఈజీ అవుతుంది. హస్తిప్​ కంపెనీ తెచ్చిన ఈ గన్​ని చాలా రకాలుగా వాడుకోవచ్చు. ఆబ్జెక్ట్‌‌‌‌కు 5–6 సెంటీమీటర్ల దూరం నుంచి దీన్ని వాడాలి. మినీ హీట్ ఎయిర్ గన్​ని హై క్వాలిటీ ఏబీఎస్​ ప్లాస్టిక్‌‌‌‌తో తయారుచేశారు. లోపలి వైపు స్టెయిన్‌‌‌‌లెస్ స్టీల్‌‌‌‌ ఉంటుంది. చాలా తేలికగా ఉంటుంది. ఇంట్లో క్రాఫ్ట్ క్రియేషన్, డీఐవై లాంటి వాటికి బాగా పనికొస్తుంది. కొన్ని సెకన్లలో 200 సెంటీగ్రేడ్స్​ టెంపరేచర్​కి చేరుతుంది. పెయింట్‌‌‌‌ని త్వరగా ఆరబెట్టడానికి, గమ్​ని ఆరబెట్టడానికి, ప్యాకేజింగ్ కోసం ప్లాస్టిక్​ పేపర్​ ష్రింక్ చేయడానికి, మైనంతో సీల్​ చేయడానికి దీన్ని వాడొచ్చు.   

ధర: 689 రూపాయలు