పిల్లలకు ఒళ్లు వేడిగా ఉంటే..జ్వరమేనా?

పిల్లలకు  ఒళ్లు వేడిగా ఉంటే..జ్వరమేనా?

ఇంట్లో చిన్నపిల్లలుంటే చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. వాళ్లకు ఏదైనా అయితే.. తెగ హైరానా పడిపోతాం. కొంచెం ఒళ్లు వేడెక్కితే చాలు జ్వరం వచ్చిందని టెన్షన్‌‌‌‌ పడిపోతాం. హాస్పిటల్‌‌‌‌కు పరుగులు పెట్టేస్తాం. కానీ, టెన్షన్‌‌‌‌ పడాల్సిన పనిలేదు. ముందు ఇంట్లోనే మెడికేషన్‌‌‌‌ తీసుకుని అప్పటికీ తగ్గకపోతే హాస్పిటల్‌‌‌‌కు వెళ్లాలి అంటున్నారు డాక్టర్లు. పిల్లలకు జ్వరం వస్తే 
ఎలాంటి కేర్‌‌‌‌‌‌‌‌ తీసుకోవాలో, ఎలాంటి సిచ్యుయేషన్‌‌‌‌లో హాస్పిటల్‌‌‌‌కు తీసుకురావాలో చెప్తున్నారు. 
డాక్టర్‌‌‌‌‌‌‌‌ను ఎప్పుడు కలవాలంటే?
ఒళ్లు వెచ్చచేసిన తర్వాత మొదటి 24 – 48 గంటల పాటు డాక్టర్‌‌‌‌‌‌‌‌ను కలవాల్సిన అవసరం లేదు. ఒకవేళ టెంపరేచర్‌‌‌‌‌‌‌‌ ఎక్కువగా ఉంటే పిల్లల డాక్టర్‌‌‌‌‌‌‌‌ దగ్గరికి వెళ్తే మంచిది. పిల్లలకు గొంతునొప్పి, చెవిపోటు, శరీరంపై ర్యాషెస్‌‌‌‌ రావటం లాంటివి ఉంటే  మాత్రం వెంటనే డాక్టర్‌‌‌‌‌‌‌‌ను కన్సల్ట్‌‌‌‌ అవ్వాలి. వ్యాక్సిన్‌‌‌‌ వేయించిన తర్వాత సహజంగానే పిల్లలకు జ్వరం వస్తుంది. ఆ జ్వరం రెండు రోజుల వరకు కూడా తగ్గకపోతే మాత్రం కచ్చితంగా హాస్పిటల్‌‌‌‌కు తీసుకెళ్లాలి.  
ఫీవర్‌‌‌‌‌‌‌‌ ఎలా కంట్రోల్‌‌‌‌ అవుతుంది?
పిల్లల వయసును బట్టి, వారికి ఇవ్వాల్సిన మోతాదులో పారాసెట్మాల్‌‌‌‌ ఇవ్వాలి. దాంతోపాటు పిల్లల నుదుటిపైన లేదా చంకల్లో తడి బట్టను ఉంచడం మంచిది. లేత రంగు‌‌‌‌ బట్టలు వేయాలి. వణుకుతుంటే వెచ్చగా బ్లాంకెట్‌‌‌‌ కప్పాలి. చల్లటి నీళ్లు, ఆల్కహాల్‌‌‌‌ కంటెంట్‌‌‌‌తో ఒళ్లు రుద్దటం లాంటివి చేయకూడదు. బిగుతైన బట్టలు, మందపాటి బట్టలు వేయకూడదు. డాక్టర్‌‌‌‌‌‌‌‌ను కలవకుండా యాంటీ బయాటిక్స్‌‌‌‌ వాడకూడదు.   
ఏ థర్మామీటర్‌‌‌‌‌‌‌‌ బెస్ట్‌‌‌‌?
పిల్లల టెంపరేచర్‌‌‌‌‌‌‌‌ చెక్‌‌‌‌ చేసేందుకు డిజిటల్‌‌‌‌ థర్మామీటర్‌‌‌‌‌‌‌‌ బెటర్‌‌‌‌‌‌‌‌. ఆ థర్మామీటర్‌‌‌‌‌‌‌‌లో సరిగా టెంపరేచర్‌‌‌‌‌‌‌‌ తెలుస్తుంది. రెక్టల్‌‌‌‌ టెంపరేచర్‌‌‌‌‌‌‌‌ (రెండు పిరుదుల మధ్య) చూడటం కొద్దిగా ఇబ్బందైనప్పటికీ సరైన టెంపరేచర్‌‌‌‌‌‌‌‌ తెలుస్తుంది. చంకలో పెట్టి చూడటం ఈజీ అయినప్పటికీ టెంపరేచర్‌‌‌‌‌‌‌‌లో కొంత తేడా వచ్చే అవకాశం ఉంది. చంక కింద టెంపరేచర్‌‌‌‌‌‌‌‌ 100 డిగ్రీలు, అంతకంటే ఎక్కువ ఉంటే జ్వరం వచ్చినట్లే. 

హై టెంపరేచర్‌‌‌‌‌‌‌‌..
102 ఫారెన్‌‌‌‌ డిగ్రీ సెంటిగ్రేడ్‌‌‌‌ దాటితే అది హై టెంపరేచర్‌‌‌‌. వైరల్‌‌‌‌ ఇన్‌‌‌‌ఫెక్షన్‌‌‌‌ లేదా డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్‌‌‌‌ లాంటివి వచ్చినప్పుడు కూడా ఈ టెంపరేచర్‌‌‌‌‌‌‌‌ ఉంటుంది. జ్వరం వచ్చినప్పుడు వచ్చే మూర్ఛను ఫీబ్రయల్‌‌‌‌ (Febrile) సీజర్స్‌‌‌‌ అంటారు. ఆరు నెలల నుంచి ఆరేండ్ల మధ్య పిల్లలకు ఇది ఎక్కువగా వస్తుంది. పిల్లల ఎదుగుదల మీద ఇది ఎలాంటి ప్రభావం చూపించదు. ఈ మూర్ఛ వచ్చినప్పుడు పిల్లలు సోయి తప్పుతారు. ఆ తర్వాత నిద్రపోతారు. ఇలా అయినప్పుడు దగ్గర్లోని హాస్పిటల్‌‌‌‌కు తీసుకెళ్లాలి.
వయసును బట్టి జాగ్రత్త
 పిల్లల వయసును బట్టి మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరు నెలలు అంతకంటే తక్కువ వయసు వాళ్లలో లక్షణాలు కనిపించవు. కాబట్టి వాళ్లకు టెంపరేచర్‌‌‌‌‌‌‌‌ ఉంటే వెంటనే హాస్పిటల్‌‌‌‌కు తీసుకెళ్తే మంచిది. ఆరు నెలల కంటే ఎక్కువ వయసు ఉన్న పిల్లలకు టెంపరేచర్‌‌‌‌‌‌‌‌ ఉన్నా.. పాలు తాగుతూ, యూరిన్‌‌‌‌ సరిగా వెళ్తూ యాక్టివ్‌‌‌‌గా ఉన్నారంటే ఒక పారాసెట్మాల్‌‌‌‌ వేయాలి. ఆ తర్వాత నిదానంగా హాస్పిటల్‌‌‌‌కు తీసుకెళ్లొచ్చు. ప్రస్తుతం ఎండల వల్ల పిల్లలకు ఎండదెబ్బ తగిలే చాన్స్‌‌‌‌ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా బాడీ టెంపరేచర్‌‌‌‌‌‌‌‌ కూడా బాగా పెరుగుతుంది. అలాంటప్పుడు పాలు సరిగ్గా తాగుతూ, యూరిన్‌‌‌‌ కరెక్ట్‌‌‌‌గా పాస్​ చేస్తూ, నీళ్లు తాగుతూ ఉంటే ఒక ట్యాబ్లెట్‌‌‌‌ వేసి 2 – 3 రోజులైనా సెట్‌‌‌‌ కాకపోతే హాస్పిటల్‌‌‌‌కు తీసుకెళ్లాలి. సన్‌‌‌‌స్ట్రోక్‌‌‌‌ తగిలినప్పుడు వదులు బట్టలు వేసి, నీళ్లు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు లాంటివి ఇవ్వాలి. టెంపరేచర్‌‌‌‌‌‌‌‌ 101 ఉండి.. డల్‌‌‌‌గా ఉంటే డాక్టర్‌‌‌‌‌‌‌‌ను కన్సల్ట్‌‌‌‌ అవ్వాలి. ఫీవర్‌‌‌‌‌‌‌‌ వచ్చినప్పుడు పిల్లలకు ఒక్కోసారి ఫిట్స్‌‌‌‌ వస్తాయి. ఫస్ట్‌‌‌‌టైమ్‌‌‌‌ అలా వచ్చినప్పుడు కచ్చితంగా డాక్టర్‌‌‌‌‌‌‌‌ దగ్గరికి వెళ్లాలి. రెండోసారి లేదా మూడోసారి అయితే మాత్రం జ్వరం టాబ్లెట్‌‌‌‌తో పాటు ఫిట్స్‌‌‌‌ కోసం ఇచ్చిన డోస్‌‌‌‌ను కూడా కచ్చితంగా వేయాలి. 
                                                                                                                                                                                          - డాక్టర్‌‌‌‌‌‌‌‌. అపర్ణ కన్సల్టెంట్‌‌‌‌ పిడియాట్రిషన్, కేర్‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్స్‌‌‌‌, హైటెక్‌‌‌‌సిటీ హైదరాబాద్‌‌‌‌.