ఇలా చేస్తే.. కట్ చేసిన ఫ్రూట్స్ రంగు మారవు

ఇలా చేస్తే..  కట్ చేసిన ఫ్రూట్స్ రంగు మారవు

పిల్లలకి లంచ్ బాక్స్ లో ఫ్రూట్స్ పెట్టిస్తారు చాలామంది పేరెంట్స్. పెద్దవాళ్లు ఆఫీస్ కి స్నాక్స్ గా, ఫ్రూట్స్ పట్టుకెళ్తారు. తీరా వాటిని తినే టైంకి అవి ఫ్రెష్ ఉండవు. యాపిల్, జామ, పియర్స్ వంటి పండ్లు తరిగిన అరగంటకే రంగు మారతాయి. వాటి రుచి కూడా మారిపోతుంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? తరిగిన ఫ్రూట్స్ అలాకాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అసలు ఫ్రూట్స్ రంగు మారడానికి కారణాలు ఏంటి?

* తరిగిన ఐదు నుంచి పదినిమిషాలకే యాపిల్, జామ, పియర్స్ లాంటి ఫ్రూట్స్ రంగు మారడానికి రెండు కారణాలున్నాయి. ఫ్రూట్స్ కి గాలి తగిలినప్పుడు, గాల్లోని మాయిశ్చరైజర్ వాటి రంగుని, టేస్ట్ ని మారుస్తుంది. అలాగే, తరిగిన వెంటనే ఫ్రూట్స్ ఎంజైమ్స్ ని రిలీజ్ చేస్తాయి. ఆ ఎంజైమెటిక్ రియాక్షన్స్ ఎక్కువసేపు గాలికి ఉన్నా, డబ్బాల్లో స్టోర్ చేసినా రంగు మారతాయి. ఈ సమస్య నుంచి బయటపడాలంటే..

• ఫ్రూట్స్ తరిగాక చల్లటి నీళ్లలో 30 సెకన్లు ఉంచాలి. దీనివల్ల ఎంజైమెటిక్ రియాక్షన్ స్లో అవుతుంది. లేదా పూర్తిగా కంట్రోల్ అవుతుంది. దాంతో ఫ్రూట్స్ ఎన్నిగంటలైనా రంగు మారవు.

• తరిగిన ఫ్రూట్స్ రంగు మారకూడదంటే ఉప్పు నీళ్లు బెస్ట్ ఆప్షన్. ఒక గిన్నెలో సగానికి పైగా చన్నీళ్లు పోసి, అర టీ స్పూన్ ఉప్పు కలపాలి. అందులో రెండు నుంచి మూడు నిమిషాలు ఫ్రూట్స్ ఉంచితే ఎక్కువ సేపు ఫ్రెష్ గా ఉంటాయి.

ALSO READ : పిల్లల అల్లరితో విసిగిపోతున్నారా..

• ఫ్రూట్స్ ని చన్నీళ్లలో కాసేపు ఉంచి, అల్లం లో ముంచినా ఎక్కువ సేపు తాజాగా జ్యూస్ ఉంటాయి. అల్లం జ్యూస్ ని ఎడిబుల్ సిట్రిక్ యాసిడ్ ఫ్రూట్స్ ని ఆక్సిడేషన్ నుంచి బయటపడేసి, మెత్తగా కానీయవు. యాపిల్, జామ, పియర్ ముక్కల్ని స్టోర్ చేసేముందు తేనె కలిపిన గోరు వెచ్చని నీళ్లలో కాసేపు ఉంచాలి. ముక్కలకి తేనె బాగా పట్టాక డబ్బాలో పెట్టాలి. దీనివల్ల ఫ్రూట్స్ రంగు మారకపోగా... ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు రుచిగా ఉంటాయి.

• ఫ్రూట్స్ ను ఫ్రెష్ గా ఉంచడంలో నిమ్మరసం, పైనాపిల్, సం లాంటి సిట్రస్ ఫ్రూట్స్ బాగా పనిచేస్తాయి. కొంచెం నీళ్లు లేదా తేనె వేసి బాగా కలపాలి. అందులో తరిగిన ఫ్రూట్స్ ను కాసేపు ఉంచితే ఎన్ని గంటలైనా ఫ్రెష్ గా ఉంటాయి.