
- ఏఎఫ్ఎస్పీఏ చట్టం ఎత్తేస్తం
- ఇంపాల్‌లో కాంగ్రెస్ ఎన్నికల హామీ
ఇంఫాల్: వచ్చే ఎన్నికల్లో తమను గెలిపించి, అధికారం కట్టబెడితే ‘ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్(ఏఎఫ్ఎస్పీఏ)’ను పూర్తిగా తొలగిస్తామని కాంగ్రెస్ పార్టీ మణిపూర్ ప్రజలకు హామీ ఇచ్చింది. అధికార బాధ్యతలు చేపట్టిన వెంటనే ఈ నిర్ణయం తీసుకుని అమలు చేస్తామని పేర్కొంది. ఈ చట్టం రద్దు చేయాలని సీఎం బీరేన్ సింగ్, ప్రధాని నరేంద్ర మోడీపై ఒత్తిడి తీసుకొస్తామని తెలిపింది. కల్లోలిత ప్రాంతాల్లో మిలటరీకి విశేష అధికారాలు కల్పిస్తూ తీసుకొచ్చిన చట్టమే ఈ ఏఎఫ్ఎస్పీఏ.. ఈ చట్టం దుర్వినియోగమవుతోందని జనం ఆరోపిస్తున్నారు. పోయిన వారం నాగాలాండ్‌లో 14 మంది పౌరులు సైన్యం జరిపిన కాల్పుల్లో చనిపోయిన విషయం తెలిసిందే! కల్లోల ప్రాంతాల్లో తనిఖీల పేరుతో ఇలాంటి సంఘటనలు తరచుగా జరుగుతున్నాయని జనం విమర్శిస్తున్నారు.