
కారేపల్లి, వెలుగు: ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం భాగ్యనగర్ తండాకి చెందిన కొందరు మహిళలు పురుగుల మందు డబ్బాతో ఆదివారం నిరసన తెలిపారు. అర్హులైన పేదలకు ఇవ్వడంలేదని ఆరోపించారు. ఎలాంటి అవకతవకలు జరగకుండా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పేదలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రేకుల ఇండ్లలో ఉండే తమకు వెంటనే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని కోరారు.