నీళ్లు బాగా తాగితే...

నీళ్లు బాగా తాగితే...

కోపం, బాధ, సంతోషం వంటి ఎమోషన్స్ మీద​ కొన్ని హార్మోన్ల  ప్రభావం ఉంటుంది. శరీరంలో హ్యాపీ హార్మోన్లు తక్కువ విడుదలైతే చికాకు, ఒత్తిడి వంటి లక్షణాలు కనిపిస్తాయి అంటోంది క్లినికల్ డైటీషియన్ శృతి భరద్వాజ్. హ్యాపీ హార్మోన్లు... సెరటోనిన్​, ఎండార్ఫిన్స్​, డోపమైన్, ఆక్సిటోసిన్  అని నాలుగు రకాలు. ఇవి తగినంత రిలీజ్​ కావడానికి ఆమె చెప్తున్న డైట్ టిప్స్ ఇవి... 

 

  • నీళ్లు బాగా తాగితే శరీరం, మెదడు ఆరోగ్యంగా ఉంటుంది.  అంతేకాదు శరీరంలోని టాక్సిన్లు బయటకు పోతాయి. డీహైడ్రేట్ అవరు. ఫలితం.. హ్యాపీ హార్మోన్లు తగినంత తయారవుతాయి.
  • ఆకుపచ్చ కూరగాయలు, ఆకుకూరలు, చిక్కుడు జాతి గింజలు, గుడ్లలో  ఫోలేట్, విటమిన్​ బి–12   ఎక్కువ. ఇవి తింటే ఒత్తిడి, చికాకు, యాంగ్జైటీ వంటివి తగ్గిపోతాయి.    
  • బాదం, వాల్​నట్స్, చియాసీడ్స్, అవిసె గింజలు వంటివి  బ్రేక్​ఫాస్ట్ లేదా శ్నాక్​గా తినడం మంచిది. వీటిలోని ట్రిప్టోఫాన్ అమైనో యాసిడ్ సెరటోనిన్ హార్మోన్ విడుదల కావడంలో సాయపడుతుంది.  
  • విటమిన్​–సి ఫుడ్ తింటే ఆక్సిటోసిన్ తగినంత ఉత్పత్తి అవుతుంది. అందుకని నిమ్మ, ఉసిరి, కమలా పండ్లు, బెర్రీలు డైట్​లో ఉండాలి.  ఒత్తిడిలో ఉన్నప్పుడు డార్క్​ చాక్లెట్లు తింటే రిలీఫ్​గా అనిపిస్తుంది. కారణం... ఇందులోని కొకోవా  ఎండార్ఫిన్లు విడుదలయ్యేలా చేస్తుంది. దాంతో ఒత్తిడి తగ్గి, మనసు తేలికవుతుంది. 
  • పులిసిన పిండితో తయారుచేసే ఇడ్లీ, దోశతో పాటు పెరుగు, మజ్జిగలో ప్రొబయాటిక్స్ ఉంటాయి. ఇవి  చికాకు, ఆందోళనను తగ్గించడంలో సాయపడతాయి. అంతేకాదు ఆలోచనాశక్తిని పెంచుతాయి.