పరగడుపున పసుపు టీ తాగితే.. బోలెడు లాభాలు

పరగడుపున పసుపు టీ తాగితే.. బోలెడు లాభాలు

పరగడుపున పసుపు టీ తాగితే బోలెడు లాభాలున్నాయి. మరి  అన్ని లాభాలున్న ఈ టీ ఎలా తయారు చేయాలో తెలుసుకోకపోతే ఎలా..

కావాల్సినవి
నీళ్లు– ఒక కప్పు, పసుపు– అర టీ స్పూన్​
బెల్లం తురుము లేదా చక్కెర– ఒక టేబుల్​ స్పూన్​
శొంఠి పొడి– చిటికెడు , అల్లంపేస్ట్​– అర టీస్పూన్​
దాల్చిన చెక్క పొడి, మిరియాల పొడి– కొంచెం

తయారీ
గిన్నెలో నీళ్లు పోసి, బెల్లం లేదా చక్కెర వేసి మరిగించాలి. నీళ్లు కాస్త వేడెక్కాక శొంఠి పొడి, తురుము వేసి, అందులో దాల్చిన చెక్క, మిరియాల పొడి కూడా కలపాలి. చివరిగా పసుపు వేసి రెండు నిమిషాల తర్వాత స్టవ్​ ఆపాలి.

లాభాలు
 పసుపులో ఉండే కుర్కుమిన్​  వల్ల  కీళ్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి. నెలసరి నొప్పుల నుంచి ఉపశమనం దొరుకుతుంది.
 పసుపు టీ తాగితే శరీరంలోని టాక్సిన్స్​ బయటికి పోతాయి. 
 పసుపు టీ తాగితే ఒబెసిటీ నుంచి బయటపడొచ్చు. లివర్​ని డ్యామేజ్ చేసే టాక్సిన్స్ తొలగించడంలో పసుపు సాయపడుతుంది.
 పసుపులో  క్యాన్సర్‌‌తో పోరాడే గుణాలు ఎక్కువ. క్యాన్సర్‌‌కి సంబంధించిన ట్యూమర్ల పెరుగుదలను అడ్డుకుంటుంది. 
 పసుపు టీ తాగితే టైప్– 2 డయాబెటిస్​ నుంచి బయటపడొచ్చు. హార్మోన్స్​ ఇంబాలెన్స్​ నుంచి కూడా బయటపడొచ్చు.