Good Health : ప్రశాంతంగా నిద్రపోతే.. షుగర్ తగ్గుతుంది.. అందం పెరుగుతుంది

Good Health : ప్రశాంతంగా నిద్రపోతే.. షుగర్ తగ్గుతుంది.. అందం పెరుగుతుంది

చాలామంది సమయం దొరికితే సోషల్ మీడియాలో మునిగిపో తుంటారు. పగలే కాదు అర్ధరాత్రి కూడా వినియోగిస్తుంటారు. టీవీ, కంప్యూటర్, వంటి వాటిని దూరంగా ఉండాలి. అంతేకాదు... పార్టీలు, ఫంక్షన్లు అంటూ సమయం వృథా చేస్తుంటారు. దీని వల్ల నిద్ర కరువవుతుంది. దాంతో అనారోగ్య సమస్యలే కాదు.. అందం కూడా తగ్గుతుందట. తగినంత నిద్రపోతేనే యంగ్ గా కనిపిస్తారని పలు సర్వేలు కూడా చెప్తున్నాయి. వృత్తిగతంగా, వ్యక్తిగతంగా ఎన్ని బాధ్యతలు ఉన్నా నిద్ర విషయంలో సరైన వేళలు పాటించాలి.

దీనివల్ల జీవక్రియ పనితీరు మెరుగుపడు తుంది. కనీసం ఎనిమిది గంటలు నిద్రపోవడం మధుమేహం సమస్య కూడా తగ్గుతుంది. మంచి నిద్రకు గది వాతావరణం కూడా అనుకూలంగా ఉండాలి. పడక గదిలో తెలుపు, గులాబి, గోధుమ వంటి లేత రంగుల్లో ఉండే పరదాలను ఎంచుకోవాలి. దుప్పట్లు, దిండు ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. అప్పుడే నిద్రకు సౌకర్యంగా ఉంటుంది.

రోజూ అరగంట పాటు వ్యాయామం చేస్తే దీర్ఘకాలిక ఫలితాలు పొందొచ్చు. అందుకు సమయం దొరికినప్పుడల్లా ప్రత్యా మ్నాయంగా సాయంత్రం వేళ నడవడం, వీలైతే సైకిల్ తొక్కడం, తాడాట ఆడటం వంటివి చేయాలి. ఇవి ఎప్పుడైనా సాధన చేయొచ్చు. కానీ యోగా, వ్యాయామం వంటివి. చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలి. ఆహారం తీసుకున్నాక పూర్తిగా ఖాళీ కడుపుతో చేయకూడదు. ముందు, తరువాత నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి. నిద్ర వేళలు కచ్చితంగా పాటిస్తే, ప్రశాంతతోపా టు అందంగా ఉంటారని వైద్యులు కూడా చెప్తున్నారు.