ఎక్సర్ సైజెస్ చేసేటప్పుడు ముఖాన్ని ముట్టుకుంటే..

ఎక్సర్ సైజెస్ చేసేటప్పుడు ముఖాన్ని ముట్టుకుంటే..

వ్యాయామాలు ఫిట్ గా ఉంచడమే కాకుండా అందాన్ని కూడా పెంచుతాయి. అయితే వర్కవుట్ ముందు, వర్కవుట్ తర్వాత చర్మం, జుట్టు పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేమిటంటే...

• మేకప్ తో వర్కవుట్ చేస్తే చెమటకి మేకప్ కరిగిపోయి చర్మరంధ్రాలు మూసుకుపోతాయి. చర్మం జిడ్డుగా కనిపిస్తుంది. అందుకే వర్కవుట్ కి ముందు తేలికైన ఫేస్వాష్ మేకప్ తీసెయ్యాలి. తర్వాత కొంచెం మాయిశ్చరైజర్, సస్క్రీన్ రాసుకోవాలి. జుట్టుని లూజ్ గా వదిలేయకుండా హెయిర్బ్యాండ్ పెట్టుకోవాలి.

• వర్కవుట్ టైంలో చెమట ఎక్కువ పడుతుంది. బాహు మూలల్లో చెమట కారణంగా బ్యాక్టీరియా, క్రిములు వంటివి చేరకుండా యాంటీ పరస్పెరంట్ రాసుకోవాలి.

• ఎక్సర్ సైజ్స్ చేసేటప్పుడు చెమట చేతులతో ముఖాన్ని ముట్టుకోవద్దు.

ALSO READ : డైజెషన్ సిస్టమ్ ని దెబ్బతీసే అలవాట్లు ఏంటంటే...

• వర్కవుట్ తర్వాత చెమట, జిడ్డు ఆరిపోయే దాకా అలానే ఉంటే ముఖం మీద బ్యాక్టీరియా చేరుతుంది. అందుకే వెంటనే నీళ్లతో ముఖం కడుక్కుంటే ర్యాషెస్, మచ్చలు రాకుండా చూసుకోవచ్చు. • వర్కవుట్ తర్వాత డ్రెస్ చెమట పట్టి ఉంటుంది. అందుకేవర్కవుట్ డ్రెస్ని వెంటనే మార్చుకోవాలి.

• జుట్టుకి తేలికైన షాంపూ వాడాలి. అలాగని రెగ్యులర్గా షాంపూ చేసుకోవద్దు.