ఎక్విప్మెంట్ లేకుండా ఇంట్లోనే ఎక్సర్​సైజ్​ చేయాలంటే..

 ఎక్విప్మెంట్ లేకుండా ఇంట్లోనే ఎక్సర్​సైజ్​ చేయాలంటే..

ఎక్విప్ మెంట్ లేకుండా ఇంట్లోనే కాస్త గట్టిగా ఎక్సర్​సైజ్ చేయాలంటే ఎలా..? అని ఆలోచిస్తున్నారా...? అందుకు కొన్ని మెథడ్స్ ఉన్నాయి అంటున్నారు ఫిట్ నెస్ ఎక్స్ పర్ట్స్.. అదెలాగంటే.. జంపింగ్ జాక్, స్క్వౌట్స్ , పుష్ అప్స్, ప్లాంక్ వంటి సాధారణ వ్యాయామాలు చేస్తే చాలు సూపర్ ఫిట్ అయిపోవచ్చు. అయితే ఎక్స ర్ సైజ్ మొదలుపెట్టే ముందు శరీరాన్ని రెడీ చేయడానికి జాగింగ్, మార్చింగ్ వంటివి చేయడం తప్పనిసరి. 
కార్డియో
బరువు తగ్గాలంటే  కార్డియో వ్యాయామాలు చాలా అవసరం. ఇవి చేయడం వల్ల పొట్ట, తొడలు, పిరుదుల వద్ద కొవ్వు కరుగుతుంది. రన్నింగ్, జంపింగ్ రోప్, స్విమ్మింగ్, ఏరోబిక్స్, సైక్లింగ్ వంటి కార్డియో వ్యాయామాలు  కొవ్వుని ఎఫెక్టివ్​గా కరిగిస్తాయి.
అదెలాగంటే...

శరీరానికి వామప్ వ్యాయామాలు చాలా అవసరం. ఎక్సర్​సైజ్​ మొదలుపెట్టే 10 నిముషాల ముందు స్ట్రెచింగ్ , జాగింగ్, మార్చింగ్ చేయాలి.
పుష్ అప్స్ చేయడం వల్ల బాడీలోని మజిల్స్‌ చురుగ్గా తయారవుతాయి. ఛాతి, భుజాల దగ్గర కండరాలు గట్టి పడతాయి. పుష్ అప్స్ చేసేటప్పుడు కాళ్లు నిటారుగా ఉంచాలి. రోజుకి10 పుష్ అప్స్ చేస్తే మంచిది. మొదటిసారి చేసేవాళ్లు ఒకటి లేదా రెండు చేయాలి.
వాకింగ్ లాంజెస్ ఎక్సర్​సైజ్​ చేస్తే పొట్ట దగ్గర కండరాలు బలపడతాయి.  తొడ దగ్గర, వీపు కింది భాగంలో పేరుకున్న కొవ్వును కరిగిస్తుంది. మడమల హామ్ స్ట్రింగ్స్​ను సాగదీసి, పిక్కలు, కాళ్ళను టోన్ చేస్తుంది. పది నుంచి ఇరవై వరకు వాకింగ్​ లాంజెస్​ చేయొచ్చు.
పొట్ట, పొత్తికడుపు, తొడల దగ్గర కొవ్వు కరగాలంటే ప్లాంక్​ ఎక్సర్​సైజ్​ను మించింది లేదు. కాకపోతే దీన్ని చేయటం కష్టం. కాబట్టి మొదటిసారి ప్లాంక్​ చేసేటప్పుడు ఎన్ని సెకన్లు ఉండగలిగితే అంతే ఉండాలి. తరువాత ఒక్కో సెకను పెంచుకుంటూ రోజుకి15 సెకన్ల ప్లాంక్ వేయగలిగితే ఫలితం ఉంటుంది.
స్క్వాట్స్ చేయడం వల్ల శరీరం బలంగా తయారవుతుంది. డైజెస్టివ్​ సిస్టమ్​ బాగుపడుతుంది. మోకాలి కీళ్లు గట్టిపడతాయి. శరీరంలోని హార్మోన్లు సరిగా పనిచేస్తాయి. ముఖ్యంగా ఆడవాళ్లకు... స్క్వాట్స్ మంచిది. మజిల్స్​ మంచిగ తయారవుతాయి. రెగ్యులర్​గా స్క్వాట్స్ చేయడం వల్ల సెల్యులైట్ ఏర్పడే అవకాశం ఉండదట. రోజుకి 20 స్క్వాట్స్​ చేస్తే బెటర్ అనేది ఫిట్​నెస్​ ఎక్స్​పర్ట్స్​ సలహా.​

జంపింగ్ జాక్స్... వీటినే సింపుల్​గా చెప్పాలంటే గెంతడం అన్నమాట. జంపింగ్ జాక్స్ గుండెకు మేలు చేసే ఎక్సర్​సైజ్. పిక్కల దగ్గర కండరాల్ని కూడా టోన్ చేస్తుంది. రోజుకు 30 జంపింగ్ జాక్స్ చేస్తే మంచిది. మొదట్లోనే ఎక్కువ చేయకుండా నెమ్మదిగా వీటి సంఖ్య పెంచాలి.
ఇవి కూడా...

రెసిస్టెంట్ బ్యాండ్, సస్పెన్షన్ ట్రెయినర్‌‌‌‌, స్కిప్పింగ్ రోప్‌‌లు ఇంట్లో ఎక్సర్‌‌‌‌సైజ్ చేసేందుకు హెల్ప్‌‌ అవుతాయి. ఇవి కొవ్వును తగ్గించి  మజిల్ గ్రోత్‌‌కి హెల్ప్ అవుతాయి. వీటి వల్ల హార్ట్‌‌బీట్ రేట్, ఊపిరితిత్తుల పనితనం పెరుగుతాయి. ఇవి కావలసిన సైజ్‌‌లో దొరుకుతాయి.

కెటిల్‌‌బెల్స్, మెడిసిన్ బాల్స్, డంబెల్స్ వల్ల మజిల్‌‌ గ్రోత్‌‌లో రెసిస్టెంట్ బ్యాండ్స్‌‌ కన్నా ఎక్కువ  ఉపయోగం ఉంటుంది. మరీ హెవీ అయినవి కాకుండా  బాడీకి తగ్గ సైజ్‌‌వి తీసుకోవడం బెటర్. 

ఇండోర్ బైకింగ్‌‌తో గంటకు 600 క్యాలరీల వరకు తగ్గించుకోవచ్చు. సైకిలింగ్‌‌కి ఆల్టర్నేట్‌‌గా ఇంట్లోనే ఇండోర్‌‌‌‌ బైకింగ్ చేయొచ్చు. ఇది బయట సైకిలింగ్‌‌తో చేసిన దాంతో సమానం. బాడీ ఫిట్‌‌గా ఉండాలంటే పంచింగ్ బ్యాగ్‌‌లు హెల్ప్ అవుతాయి. దీనివల్ల అప్పర్ బాడీలోని  చేతులు, ఛాతి, వీపు, భుజాలు ఫిట్‌‌గా అవుతాయి.